Our Health

పాజిటివ్ సైకాలజీ – మతం చేసే హితం. 15.

In మానసికం, Our minds on మే 29, 2012 at 12:15 ఉద.

పాజిటివ్ సైకాలజీ –  మతం చేసే హితం. 15.

మన జీవితార్ధం తెలుసుకోవడం లో మన మతం చేసే హితం ఎంతో ఉంది. త్రికరణ శుద్ధి తో
( అంటే, మనసా , వాచా , కర్మణా ) ఆచరించే ఏ మతం అయినా  ఇహ పర సాధనకు సోపానం అవుతుంది. మతం తో  దానగుణం , సేవా దృక్పధం అలవడుతాయి.అలాగే వేదాంత ధోరణి , పరోపకార  నైజం , ఇలాంటి గుణాలు కూడా , జీవితార్ధాన్ని , జీవిత పరమార్ధాన్ని  మనకు ఎప్పటికప్పుడు తెలియ చేస్తూ , అధికానంద హేతువు అవుతాయి.  నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలనే తృష్ణ , జిహ్వ కూడా అధికానందం పొందడానికి దోహద పడతాయి.  
చిన్న చిన్న సేవా కార్యాలు ఒక క్రమం గా అంటే వారానికో పక్షానికో కొన్ని సార్లు  చేస్తూ ఉంటే కూడా , మనం  అధికానందం పొందుతాము.  అంతే కాకుండా, మనం చేసే చిన్న చిన్న సేవా కార్యాల  వల్ల మనం మన ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఏర్పరుచుకో గలుగు తాము. అలాగే వారి నుంచి పాజిటివ్ అభిప్రాయాలు కూడా స్వీకరించ గలుగుతాము .
క్షమా గుణం : మనం మన జీవితాలలో  ఎన్నో సంఘటనలు , మనకు కోపం , ఉద్రేకము కలిగిస్తూ ఉంటాయి. ఇలా మన కోపానికి ఇతరులు కూడా చాలా సమయాలలో కారకులవుతుంటారు. కానీ మనం క్షమా గుణం అలవరుచు కుంటే, మన మనసు తేలిక అవుతుంది.  మనకు అధికం గా కోపం తెప్పించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే , వారిని క్షమిస్తూ ఉన్నట్టు ఒక ఉత్తరం రాసి పారేస్తే కూడా ఆ కోపం మాయ మవడమో, లేక తగ్గి పోవడమో జరుగుతుంది.  అలా కాక మనం, వారిని క్షమించ కుండా  తరచూ కోపం తెచ్చు కుంటూ ఉంటే ,  ఆ ( కోపం కలిగించిన ) సంఘటనలు పదే పదే  మన మనసులను తోలిచినట్టు అయి , మనను కలత పెడుతూ ఉంటాయి. 
ఇక్కడ సుమతీ శతక కారుడు వందల ఏళ్ల క్రితం వ్రాసిన పద్యం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే  ఆ పద్యం యదార్ధం కూడా ! 
తన కోపమే తన శత్రువు, 
తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌ , 
తన సంతోషమే  స్వర్గము  
తన దుక్ఖమే నరకమండ్రు తధ్యము సుమతీ !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
 1. చిత్రం వైద్య శాస్త్రం మతాన్ని ప్రోత్సహిస్తుందా?

  • శర్మ గారూ,
   ఆనందమయ జీవితానికి మనం ఆచరించే మతం కూడా సహాయ పడుతుందని అనేక పరిశీలనలలో విశదమైంది. అలాగని వైద్య శాస్త్రం మతాన్ని ప్రోత్సహిస్తుందని అర్ధం చేసుకోకూడదు. మనందరికీ తెలుసుకదా వైద్య శాస్త్రానికి ఎప్పుడూ ఒకటే మతం , అదే మానవత్వం !
   ఈ క్రింద ఉంచిన వివరాలు చూడండి. ( సమయం తక్కువ అవటం వల్ల దీనిని తెలుగులో అనువాదం చేయలేదు. క్షంతవ్యుడిని )
   Dr. Edward Diener, who has studied happiness across cultures and has pinpointed some universal reasons that people are happier. One is religion. I ( not Sudhakar ! )had the opportunity to interview Dr. Diener.

   Question: Why does religion seem to make people happier?

   Dr. Diener: Many studies find that religious people on average are happier. But since not all religious people are happier, and not all religious beliefs seem to lead to happiness, we have to search for the “active ingredient” in what aspect of religion might increase feelings of well-being. In our book on happiness, my son and I argue that one key ingredient is positive spirituality, feeling emotions such as love, awe, wonder, respect, and gratitude that connect us to others and to things larger than ourselves. That is, spirituality can focus us on larger causes than our own personal welfare, and this can give us purpose and meaning. Also, this broader focus on others and purpose can help us quit worrying so much about ourselves. And it can help us connect to others.

   Religion has been associated with happiness for other reasons. For instance, religion often gives people social support and contact. People meet other like-minded people at any place of worship , and in many instances can count on those folks when they need help. Another reason that some religions might increase subjective well-being is that they provide optimism for an afterlife. These religions solve the “terror” associated with death by promising a better life after death. Another reason that religion can help happiness is that it provides a moral compass, rules to live by. We need something more than our own hedonism to guide our behavior, and religion can help to provide guidelines to follow in order to have an orderly and moral life, that helps us get along well with others. Finally, religion can provide answers to large questions, such as where did the universe come from, why is there evil, etc.

   In our research, we are surprised to find that the happiest nations are often relatively nonreligious, such as Scandinavian societies. This is surprising, because we also find that religious people have more positive feelings in most nations. So it is a puzzle as to why people in wealthier societies are so frequently turning away from religion. It seems from our analyses that people most turn to religion when conditions in their society are tough – poverty, conflict, and so forth. When conditions are good, fewer people in a nation continue to be religious. Even then, the religious individuals report more positive emotions.

 2. మీరన్నమాటే. వైద్యశాస్త్రం మతాన్ని ప్రోత్సహించదు, అది ఆచరించేవారు ఆనందంగా ఉంటారని ఒప్పుకుంటుంది కదా! వైద్య శాస్త్రం సైన్స్ కదా! సైన్స్ మతాన్ని ఒప్పుకోదని, సైన్స్ ను నమ్మేవారు మతము భగవంతుడిని నమ్మకూడదని ఈ మధ్య ఒకరెవరో పెద్ద పెద్ద కేకలేస్తూ చెప్పేరు లెండి అందుకు అడిగాను.ఆనందమే జీవిత పరమావధి కదా. అది సాధించాలంటే మతం మంచిదేగా. సమ్మతమే మతం. అదే మానవత్వం. అర్ధం చేసుకోలేని వారితోనే ఇబ్బంది. మతం అంటే ఆలోచనా విధానమని అర్ధం కదా! పాపం దీన్ని రెలిజియన్ అని మార్చేసుకుని కొట్టేసుకుంటున్నారు. మీ వివరణకి ధన్యవాదాలు.

 3. చక్క గా చెప్పారు శర్మ గారూ,
  వైద్య శాస్త్ర రీత్యా, మంచి ఆహారం మన భౌతిక ఆరోగ్యానికి ఎట్లాంటిదో , మతం కూడా మన మానసిక ఆరోగ్యానికి అట్లాంటిదే . ‘ అతి సర్వత్ర వర్జయేత్ ‘ అనే నానుడి మనకు తెలుసు కదా ! ఆహారం అయినా, మతమైనా ‘ అతి ‘ అయితే పరిణామాలు ఎట్లా ఉంటాయో మనకందరికీ తెలుసు కదా అందువల్ల ఇక్కడ వివరించడం లేదు. ‘ కొట్టుకుంటున్నా’ , ‘కొట్టేస్తున్నా’ , మతాన్ని అడ్డం పెట్టుకుని ‘ మానవులు ‘ చేసే పనే కదా ! మీరు మీ బ్లాగు ఆశయం ‘ సర్వే జనా సుఖినోభవంతు ! అని ప్రవచించారు కదా ! నా వరకు నేను కూడా అందరి ‘ బాగు ‘ నే కోరుకుంటాను.

 4. ఆలోచింపచేసే మంచి వ్యాసం, కామెంట్ అందించినందుకు ధన్యవాదాలు. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలేమీ లేని కుటుంబాలలో దేవుడిగురించి పెద్దగా ఆలోచించకపోవడం, సంతోషంగానే ఉండటం నేను ఇక్కడ(భారతదేశంలో) కూడాగమనించాను.

  అయితే, మతం లేకపోతే, జీవితంలో పాటించడానికి విలువలు, ప్రమాణాలు, బెంచ్ మార్క్స్ ఎలా సాధ్యమవుతుందో అర్థం కాలేదు.

  డాక్టర్ గారూ, వ్యక్తిగత సలహాగురించి ఇటీవల నేను అడిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మీరు బ్గాగులోనే చర్చిద్దామని అన్నారు. అయితే, ఇక్కడ ఇమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాల్సివస్తోందనే ఉద్దేశ్యంతో, నేను మీకు వ్యక్తిగతంగా రాస్తానని అన్నాను. నేను మెయిల్ పంపిన తర్వాత మీరు దానిని anonymous కింద కామెంటుగా పబ్లిష్ చేయొచ్చేమోకదా!

  • మత ప్రమేయం లేని లౌకిక దేశం గా భారత రాజ్యాంగం చెపుతుంది. ( కానీ అది కాగితాల వరకే పరిమితమైందని అందరికీ తెలుసు కదా ! ) అలాగే మత ప్రమేయం లేని , విలువల తో నిండిన జీవితాలు గడుపుతున్న వారూ ఉన్నారు చాలామంది , ప్రపంచం లో. మతాలూ చాలా ఉన్నాయి. ఉండాల్సినదల్లా మన జీవన శైలి లో ( మత ) విలువలు పొందు పరుచు కోవడం, ఆచరించ డమూ కదా !
   ( అలాగే. మీ సందేహాన్ని పంపండి. సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: