పాజిటివ్ సైకాలజీ. ( flow )వివరణ.12.
క్రితం టపాలో చూశాము కదా ఫ్లో సైకాలజీ అంటే ఏమిటో! ఇప్పుడు దాని వివరణ చూద్దాము.
మనం ఒక అందమైన రంగుల పటం కూడా చూశాము కదా! కానీ ఆ పటం చూడటానికి బాగుంది కానీ వెంటనే మనకు విషయం అర్ధం అవటం లేదు కదా ! ఆ పటాన్నే ఇంకోవిధం గా పైన చూపించడం జరిగింది. చూడండి.
ఇక్కడ ఎడమ ప్రక్క మనం చేయ బోయే పని యొక్క క్లిష్టత అంటే డిఫికల్టీ ను సూచిస్తుంది. పై దిశలో బాణం ఉంది కాబట్టి పని క్లిష్టత ఎక్కువ అవుతున్నట్టు చూపించడం అన్న మాట. అలాగే , మన నైపుణ్యాన్ని అడుగు భాగం లో చూపడం జరిగింది. ఇక్కడ బాణం ఎడమ నుంచి కుడి దిశ లో ఉన్నట్టు చూపించడం జరిగింది కదా అంటే మన నైపుణ్యం కుడి దిశ లో ఎక్కువ అవుతున్న్నది అని అర్ధం.
ఇప్పుడు మధ్య లో ఉన్న వలయం పరిశీలించండి. మనం రిలాక్సేషన్ అన్న చోటనుంచి మొదలు పెడదాము. అంటే మనకు సగటు నైపుణ్యం ఉండి, మనం చేయవలసిన పని కష్టం గా లేనప్పుడు, ఆ పరిస్థితి రిలాక్సేషన్, ( relaxation ) కు దారి తీస్తుంది. అంటే అక్కడ ఆనందం ఉండదు. కేవలం సేద తీర్చుకోవడమే జరుగుతుంది. వలయం లో రిలాక్సేషన్ కు ఎడమ ప్రక్క గా అపతీ ( apathy )ఉంది కదా. అపతీ అంటే నిరుత్సాహం అని అర్ధం. ఆ పరిస్థితి , మనకు పని లో నైపుణ్యం లోపించి, దానికి తగ్గట్టుగా, మనం చేసే పని కూడా క్లిష్టం కానప్పుడు ఏర్పడుతుంది. అలా కాకుండా మనం చేసే పని ఒక మాదిరి గా క్లిష్టం గా ఉండి, మనకు ఆ పనిలో నైపుణ్యం లోపించినప్పుడు , మనం వర్రీ ( worry ) అవడం జరుగుతుంది. అంటే కలత చెందడం. చేయవలసిన పని ఇంకా కష్టం గా ఉండి , మన నైపుణ్యం దానికి తగ్గట్టు గా లేక, తక్కువ గా ఉంటె, అప్పుడు (anxiety ) యాంగ్ జైటీ అనుభవిస్తాము, అంటే ఆందోళన చెందుతాము . మనం చేయవలసిన పని ఎక్కువ కష్టం గా ఉండి , మన నైపుణ్యం సగటుగా అంటే ఒక మాదిరిగా ఉన్నప్పుడు మనం ఎక్కువ అప్రమత్తత తో ఉంటాము. ( దానినే ఎరౌజల్ , arousal అంటారు ) ఇక మనం చేసే పని అతి క్లిష్టం గా ఉండి , మన నైపుణ్యం కూడా ఎక్కువ గా ఉంటె ,
అప్పుడు ఫ్లో ( flow ) స్థితి ఏర్పడుతుంది. అంటే అప్పుడు మనం ఆ పనిలో , పూర్తీ గా నిమగ్నమయి , ఏకాగ్రత తో ఆ పని చేస్తూ , అత్యంత ఆనందం పొందుతామన్న మాట.అప్పుడు మనకు కాలం కూడా తెలియదని అనిపిస్తుంది. ఇక మనం చేయవలసిన పని కష్టం గా లేకున్నా, శులభం గా ఉన్నా , మనకు ఆ పనులలో నైపుణ్యం ఎక్కువ ఉంటే, ఆ పని చేయడం లో పూర్తి నియంత్రణ ( control ) ఏర్పడడమూ, లేదా( boredom ) బోరు గా అనిపించడమూ జరుగుతాయి.
వచ్చే టపాలో ఈ ఫ్లో సైకాలజీ తో పొందే ఉపయోగాల గురించి తెలుసుకుందాము !
good
వ్యక్తిగత పనితీరును, performance levelsను, productivityని విశ్లేషించుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంది ఈ వ్యాసం. ధన్యవాదాలండి. డాక్టర్ గారూ, మీరు ఏమీ అనుకోకపోతే నాదొక అభ్యర్థన. వ్యక్తిగత సలహాకోసం మిమ్ములను సంప్రదించాలనుకుంటున్నాను. అభ్యంతరం లేకపోతే మీ మెయిల్ ఐడి ఇవ్వగలరు. మీకు వీలుకాకపోతే హైదరాబాద్ లో మంచి సైకాలజిస్ట్ పేరు ఎవరిదైనా సూచించగలరు.
శుభాభినందనలతో…
తేజస్వి గారూ, టపాలు మీకు ఉపయుక్తం గా ఉంటున్నందుకు సంతోషం. మీ సందేహాలనూ , ప్రశ్నలనూ ‘ బాగు ‘ ద్వారా తెలుప వచ్చు కదా !
( మీకు ఇబ్బంది గా ఉంటే మారు పేరు తో కానీ ! ) ( అంతే కాక మీరు కోరితే , మీ ప్రశ్నలూ, సందేహాలూ , బ్లాగు లోనుంచి తొలగింప బడతాయి కూడా ! ) నాకు హైదరాబాదు లో ఉన్న సైకాలజిస్ట్ల వివరాలు తెలియవు ( నేను UK లో ఉంటాను ).