Our Health

పాజిటివ్ సైకాలజీ – ఫ్లో ( flow ) తో ఎంగేజ్ మెంట్. 11.

In మానసికం, Our minds on మే 25, 2012 at 7:59 సా.

పాజిటివ్ సైకాలజీ – ఫ్లో  ( flow ) తో  ఎంగేజ్ మెంట్. 11.

 
క్రితం టపాల  లో  ఆశావాద మనస్తత్వం లో  అధికం గా నిమగ్నమవటానికి , కుటుంబం తోనూ , స్నేహితులతోనూ , సత్సంబంధాలు పెంపొందించు కోవడం , ఇంకా మన శక్తి యుక్తులు మనం తెలుసుకొని మన నైపుణ్యాన్ని  పటిష్టమైన ( మానవ ) సంబంధాలకోసం ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా చూశాము కదా !  ఇప్పుడు ఫ్లో అంటే ప్రవాహ మనస్తత్వం అంటే ఏమిటో దానితో మన  ఎంగేజ్ మెంట్ అధికం ఎట్లా అవుతుందో తెలుసుకుందాము .
C.మిహాలీ అంటే సైకాలజిస్ట్ , మానవులు తాము ఏ పనిలోనైనా  అత్యధికం  గా ఆనందం పొందుతున్నప్పుడు,  వారు ఏ విధమైన అనుభూతులు చెందుతారు ? , ఎందుకు ఆ అనుభూతులు చెందుతారు ? అనే విషయం మీద దశాబ్దాల కొద్దీ పరిశోధన చేశాడు.
చివరకు ఆయన  అభివృద్ధి చేసినదే ఫ్లో సైకాలజీ ( flow psychology ) ( అంటే ప్రవాహ మనస్తత్వం అన వచ్చు నేమో తెలుగు లో ) 
సైకాలజీ లో ఫ్లో  ( flow ) అంటే ఏమిటి ? 
ఫ్లో అంటే ఒక అత్యంత ఆనంద స్థితి , మనం చేసే పనిలో సంపూర్ణం గా ‘ మమైకం ‘ అయి పోవడం, ఇంకా మన  క్రియే టివిటీ. ఆ స్థితిలో మనకు సమస్యలు ఏవీ కనిపించవు. మనం ఒక రకమైన  ట్రాన్సెండెన్స్   స్థితి లో ఉంటాము.  సాధారణం గా ఈ ఫ్లో స్థితి , ఆటలలోనూ ,మనకు ఇష్టమైన హాబీలు చేస్తున్నప్పుడు, లేక ఒక కళను చూపిస్తున్నప్పుడు  కలుగుతుంది.  మిహాలీ కొన్ని పరిస్థితులు ఉంటే  ఆ ఫ్లో మనం  చేపట్టే ఏ కార్యం లోనైనా , ఆ ( ఫ్లో ) అనుభూతి చెందవచ్చు అని తెలిపాడు. ఆ పరిస్థితులు :
1. మనం చేపట్టిన కార్యం కొంత వరకూ కష్టమైనది , అంటే చాలెంజింగ్ అయినదీ , ఇంకా ఆ పని మన నైపుణ్యాన్ని పరీక్షించేదీ అంటే మన శక్తి యుక్తులను పరీక్షించేదీ అవుతున్నప్పుడు .
2. మన లక్ష్యాలు స్పష్టం గా నిర్దేశింప బడినప్పుడు,
3. మనం చేసే పని మీద మనకు పూర్తిగా కంట్రోలు లేక నియంత్రణ ఉన్నప్పుడు,
4. మనం ఆ పని ని పూర్తి ఏకాగ్రత తో,  ఆ పని లో నిమగ్నమయి ,  చేస్తున్నప్పుడు ,
5. మనం చేసే పని ద్వారా మనం(ఆ పని చేసిన ) వెంటనే దాని ఫలితాలు పొంద గలిగితే, 
6. ఆ పని లో       స్వీయ ప్రయోజనాలు   లేనప్పుడు . 
మనం వచ్చే టపాలో ఈ ఫ్లో సైకాలజీ గురించి మరిన్ని వివరాలు చూద్దాము ! 
 
 
 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: