పాజిటివ్ సైకాలజీ – సేవరింగ్ ( ఆస్వాదన ) తో జీవితం లో అధికానందం పొందడం ఎట్లా ?.6.
3.స్వీయాభినందన : సెల్ఫ్ కంగ్రాట్యులేషన్ : అంటే మనల్ని మనం అభినందించు కోవడం. సాధారణం గా మనం మన జీవిత కాలం లో వివిధ దశలలో , విజయాలు సాధిస్తూ ఉంటాము. కానీ నిరాడంబరతకు సూచనగా, మనం ఆ విజయాలను ప్రకటిస్తూ ‘ దండోరా ‘ వేయించి అందరికీ చెప్పము కదా ! కానీ మన విజయాలను చూసి మనకు మనం అభినందించు కోవడం , మన ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుంది. ఎందుకంటే మనం సాధించే ప్రతి విజయమూ , మనల్ని ప్రగతి పధం లో ముందుకు తీసుకు వెళుతుంది కదా ! ఆ విజయాలు కేవలం పరీక్షలో ఉత్తీర్నతే కానవసరం లేదు. మనం చేసే నిర్మాణాత్మక పని ఏదైనా కావచ్చు. అది మన జీవితాలలో ఏదో ఒక ఒక ముఖ్య మైన కార్యం అవవచ్చు.
4.ఇతరులతో పంచుకోవడం : అంటే షేరింగ్ విత్ అదర్స్ : సైకాలజిస్టులు సేవరింగ్ అంటే ఆస్వాదనలో అత్యంత ముఖ్యమైన కిటుకు గా దీనిని చెపుతారు. మనం మనకానందం కలిగించే ఏ పని అయినా ఇతతులతో పంచుకుంటే అది అధికానందానికి దారి తీస్తుంది.
ఇక్కడ కూడా ఈ ఆనందం కలిగించే సంఘటనలు , సంగీతం, సినిమా, ఆట , ఆహారం, పార్టీ , ఇలా ఏవైనా కావచ్చు. ఒక విహార యాత్ర కావచ్చు. ఇలా ఈ సంఘటనలలో మనకు పరిచయమున్న వారితో పంచుకుంటే అంటే కలిసి ఈ పనులు చేస్తే , ఆనందం అధికమవుతుందని అనేక పరిశీలనలలో తెలిసింది. అలాగే మనం ఆస్వాదించిన ఆ సమయాలను ఇతరులతో పంచుకుంటే కూడా , అంటే వారికి , మనం ఆయా సంఘటనలలో ఎంత ఆనందించామో ఇతరులతో చెపితే కూడా మనం అధికానందం పొందగలం.
5.స్మృతులు : మెమరీ బిల్డింగ్ : అంటే మనం ఆనందం గా ఆస్వాదించిన క్షణాలను , పదిల పరుచుకోవడం. అంటే మన జ్ఞాపకాలలో పదిలం గా ఉంచుకోవడం. ఆ జ్ఞాపకాలు, కేవలం జ్ఞాపకాలు గా కానీ , ఫోటోల రూపం లో కానీ, లేక రికార్డు చేసిన వీడియో ల రూపం లో కానీ, లేక ఏ ప్రదేశానికైనా వెళ్లి వస్తే , అక్కడ కొన్న సూవనీర్స్ కానీ, ఇలా మన ఆనంద సమయాన్ని పదిలపరుచుకుంటే కూడా అధికానందం పొందగలం. ఇవన్నీ, తరువాత మనం ఇతరులతో పంచుకునేందుకు, తద్వారా ఆనందం పొందేందుకు సహాయం చేస్తాయి.
( సేవరింగ్ ‘ savouring’ అనే పదాన్ని చదువరుల సౌలభ్యం కోసం అలాగే వాడడం జరిగింది.మనకు తెలుసుకదా మనం సామాన్యం గా తినే ఆహారం లో రుచిని అధికం చేయడానికి వాడే పదార్ధాలను savouries ,సేవరీస్ అంటారు.అలాగే మన జీవిత రుచులను కూడా అధికం చేసుకోడానికి savouring లేక ఆస్వాదన అనే పదాన్ని ఉపయోగించారు.
మనం మామూలు గా ‘ రుచి చూడడం ‘ ఇంకా ‘ ఆస్వాదించడం ‘ అంటే ‘ tasting and savouring ‘ లకు ఉన్న తేడాను గ్రహించి , కేవలం రుచి చూడకుండా , ఆస్వాదన చేయడం అలవాటు చేసుకుంటే , మనం మన జీవితాలలో ఎక్కువ ఆనంద పడతాము. ( ఈ సేవరింగ్ లేక ఆస్వాదన ను అధికం చేసుకోవడానికే టపాలలో చెప్పిన అయిదు కిటుకులు. ఇవి శాస్త్రీయం గా ఋజువు చేయబడ్డాయి కూడా ! )

వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు తెలుసుకుందాము !
సేవరింగ్ పదానికి బదులు ఆస్వాదించడం అని రాయవచ్చు డాక్టర్ గారూ
సారీ డాక్టర్ గారూ, వ్యాసంలోకి వెళ్ళకుండా, హెడ్డింగ్ చదవగానే ఆస్వాదన అని రాయొచ్చని చెప్పాను.
మీరు సారీ చెప్పనవసరం లేదు తేజస్వి గారు,
సేవరింగ్ ‘ savouring’ అనే పదాన్ని చదువరుల సౌలభ్యం కోసం అలాగే వాడడం జరిగింది.
మనకు తెలుసుకదా మనం సామాన్యం గా తినే ఆహారం లో రుచిని అధికం చేయడానికి వాడే పదార్ధాలను savouries ,సేవరీస్ అంటారు.
అలాగే మన జీవిత రుచులను కూడా అధికం చేసుకోడానికి savouring లేక ఆస్వాదన అనే పదాన్ని ఉపయోగించారు.