హృదయం లయ తప్పితే ఏ పరీక్షలు చేయించాలి?.38.
హృదయం లేక గుండె, లయ అంటే ఏమిటి , లయ తప్పటం ఏమిటి , ఏ పరిస్థితులలో లయ తప్పుతుందో , మనం క్రితం టపాలలో వివరం గా చూశాము , తెలుసుకున్నాము కదా !
మరి ఏమి చేయాలి అట్లాంటి పరిస్థితులు ఏర్పడినా, ఆ అనుమానం వచ్చినా?
ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి , కార్డియాలజిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం.
సాధారణం గా చేసే పరీక్షలు ఇలా ఉంటాయి.
రక్త పరీక్షలు ( రక్తం లో లవణాలు , తయిరాయిడ్ హార్మోను , అలాగే గ్లూకోజు ఎంత ఉందొ తెలుసుకుంటే కొన్ని కారణాలు కూడా తెలుస్తాయి. )
అలాగే ECG అంటే ఎలెక్ట్రో కార్డియో గ్రాం అంటే గుండె ‘రాత ‘ కనుక్కుంటే దానివల్ల కొన్ని కారణాలు తెలియ గలవు.
కొన్న్ని సమయాలలో కేవలం ఒక సారి తీసిన ఈ సి జీ తో ఒక ఐడియా ఏర్పడక పోవచ్చు , అందు వల్ల 24 గంటల ఈ సి జీ అంటే దానిని Holter monitoring అంటారు. అది అవసరం కావచ్చు. ఎందుకంటే గుండె కొట్టుకోవడం లో అవకతవకలు 24 ఎప్పుడో కొంత సమయం లో రావచ్చు. ఆ సమయం ఒక్క సారి చేయించుకునే ECG అంటే ఈ సి జీ పరీక్ష తో ఏకీభ వించక పోవచ్చు. అందువల్ల ఒక మానిటరింగ్ ఆపరేటస్ ను శరీరానికి ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలూ ‘ తగిలించి ‘ అందులో గుండె రాతలు అంటే ఎలెక్ట్రికల్ యాక్టివిటీ అఫ్ హార్ట్ పరిశీలించుతారన్న మాట.
యాంజియో గ్రాం ఇంకా ఎకో కార్డియో గ్రాం కూడా అవసరం ఉండవచ్చు , ఉన్న కారణాన్ని బట్టి.
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !