పాజిటివ్ సైకాలజీ అందరికీ ఎందుకు ?.1.
మనం, నిత్య జీవితం లో ఎన్నో ఒడి దుడుకులు ఎదుర్కొంటూ ఉంటాము. జననం నుంచీ, తుది క్షణాల దాకా , వయసు తో సంబంధం లేకుండా , అనేక అనుభూతులు ఆస్వాదిస్తూ ఉంటాము. సుఖాలు వచ్చినప్పుడు, ఆనందం తో పరవశులవుతాము. అలాగే కష్టాలు అనుభవం అవుతున్నప్పుడు , తల్లడిల్లి పోతాము.
నిరాశా నిస్పృహలకు లోనవుతాము. ఆ కష్టాలు త్వరగా తీరిపోవాలని కోరుకుంటూ ఉంటాము. ఈ ఆనంద విచార నిత్య ఘర్షణలో మనం విజయ వంతం ఎట్లా అవగలం? విషాదం పైన విజయానికి సరిపడిన ‘ ఆయుధాలు ‘ మనకు ఉన్నాయా ? ఒకవేళ విషాదం అనివార్యమైతే , దానిని ఏ దృక్పధం తో తీసుకోగలం ? మరి మన జీవితాలలో ఆనంద మయ సమయాన్ని ఏ విధం గా మనం ఎక్కువ చేసుకోగలం?
మనం ఆచరిస్తున్న జీవన శైలి , ఆచార వ్యవహారాలూ , సంప్రదాయాలూ , మనల్ని నిజంగా ఆనంద పరుస్తున్నాయా ? మరి శాస్త్రీయం గా ఏమైనా కిటుకులు ఉన్నాయా ?, మన జీవితాలు ఎక్కువ ఆనందం గా ఉండటానికి ?
వీటికి సమాధానాలు వెదకడం కోసమే మనమందరం పాజిటివ్ సైకాలజీ ( positive psychology ) గురించి తెలుసుకోవాలి.
వచ్చే టపా నుంచి ఈ పాజిటివ్ సైకాలజీ వివరాలు తెలుసుకుందాము.
చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. మీ వ్యాస పరంపరకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. శుభాభినందనలు.
కృతఙ్ఞతలు తేజస్వి గారు . మీ అభిప్రాయాలు/సలహాలూ తెలపడం మరవకండి, మరి !