డ్యాష్ ( DASH ) డైట్ ఎందుకు బెస్ట్ ?. 25.
క్రితం టపాలో చూశాము కదా డ్యాష్ డైట్ శాస్త్రీయం గా అధిక బీ పీ తగ్గించే డైట్ గా ఋజువు చేయ బడిందని.
మరి ఈ డైట్ వివరాలు ఇప్పుడు చూద్దాము.
స్థూలం గా డ్యాష్ డైట్ ఈ సూత్రాల మీద ఆధార పడి తయారు చేయబడ్డది.
1. ఈ డైట్ లో స్యాచు రేటెడ్ ఫ్యాట్, కొలెస్టరాల్, ఇంకా టోటల్ ఫ్యాట్ – ఇవన్నీ తక్కువ గా ఉంటాయి. ( అంటే low in saturated fat, cholesterol and total fat )
2. ఎక్కువగా , కాయగూరలు, పళ్ళు , కొవ్వు శాతం అతితక్కువ గా ఉన్నలేక అసలు లేకుండా ఉన్న పాల కు ఈ డైట్ లో ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వడం జరిగింది. ( అంటే focuses on vegetables, fruits and low fat or no fat milk and milk products )
3. ప్రాసెస్ చేయని ధాన్యాలు, బీన్స్ , విత్తనాలు , నట్స్ , శాక హారులకు , ఇంకా చేపలు, కోడి మాంసం మొదలైనవి శాకాహారులు కాని వారికీ – ఇవి ఆహారం లో ఎక్కువగా తీసుకోవచ్చు ఈ డైట్ లో. ( DASH diet is rich in whole grains, beans,seeds, nuts ( for vegetarians and fish and poultry for non vegetarians )
4. పంచదార , లేక చెక్కెర తో చేసిన స్వీట్స్ , చెక్కెర ఏ రూపం లో ఉన్నా , ఇంకా ఎర్ర మాంసం
( శాకాహారులు కానివారు ) వీటిని వీలయినంత తక్కువ గా ఈ డైట్ లో వాడాలి. ( contains fewer sweets, added sugars, or sugary beverages for vegetarians and these plus red meats for the non vegetarians )
5. ఈ డ్యాష్ డైట్ లో సోడియం అంటే common salt , అంటే మనం రోజూ ఆహారం లో తీసుకునే ఉప్పు కూడా చాలా తక్కువ వాడమని సిఫార్సు చేయబడ్డది. ఎందుకంటే , మనం తీసుకునే ఉప్పు , మన దేహం లో , ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే మన రక్త పరిమాణాన్ని అంటే బ్లడ్ వాల్యూం ను పెంచుతూ , తద్వారా మన రక్త పీడనాన్ని అధికం చేస్తుంది.
( ఆహారం లో అధిక ఉప్పు మనకు తెచ్చే ముప్పు గురించి మనం ఒక టపా లో పటం సహాయం తో తెలుసుకున్నాము కదా ! అందువల్ల ఇక్కడ వివరించడం లేదు )
పైన చెప్పిన ఈ మూల సూత్రాలు మనకందరికీ తెలిసినవే అని అశ్రద్ధ చేయకూడదు. ప్రతి వాక్యం లోనూ, శాస్త్రీయం గా ఋజువు చేయబడ్డ నిజాల అంటే యదార్దాలు ఉన్నాయి. ఉదాహరణకు శాక హారులు కూరగాయలను ఎక్కువ గా తీసుకోవచ్చు అని ఉన్నది కదా అని మూడు నాలుగు కూరలు చక్కగా వేపుడు చేసి రోజూ రెండు పూటలో , మూడు పూటలో తిన్నామనుకోండి , ( వేపుడు చేసిన కూరలు ఎవరికీ ఇష్టం ఉండవు కనక ! ) అప్పుడు మనం ఈ డైట్ సూత్రాలలో మొదటి సూత్రాన్ని అశ్రద్ధ చేసిన వారం అవుతాము కదా అంటే వేపుడు కూరలలో కొలెస్టరాల్ శాతం ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ! ఆ పరిస్థితిలో మనం ఈ డ్యాష్ డైట్ ను నిందించలేము , మనకు పనిచేయట్లేదని ! )
అలాగే ప్రాసెస్ చేయని ధాన్యాలు , నట్స్ , లేక విత్తనాలు ప్రత్యేకించి ఈ డ్యాష్ డైట్ లో ఎక్కువ గా వాడమని ఎందుకు రికమెండ్ చేయ బడిందంటే, అలాంటి ఆహారం లో మనకు రోజూ కావలసిన విటమిన్లూ ,ఖనిజాలూ , ఇంకా పీచు పదార్ధం ఎక్కువ గా ఉంటుంది.
( అంటే vitamins, minerals and fibre ) ముఖ్యం గా ఖనిజాలూ, విటమిన్లూ , మనకు మన రోజువారీ ఆహారం లో అతి తక్కువ పరిమాణం లో ఉండి, మనకూ , మన ఆరోగ్యానికీ , అంటే భౌతిక ఆరోగ్యమూ, మానసిక ఆరోగ్యానికీ , అన్ని విధాల అత్యంత లాభ దాయకం చేస్తాయి. మన దేహం లో అనునిత్యం జరిగే అనేక అత్యంత క్లిష్టమయిన జీవ రసాయన చర్యలు ఈ విటమిన్ల లోపం ఉంటె కుంటు పడతాయి, లేక ఆగి పోతాయి కూడా ( లోపం అత్యధికం అయినప్పుడు ). అట్లాగే మన ఆహారం లో పీచు పదార్ధం లోపమయితే , కొన్ని రకాల కోలన్ అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ లకు కారణ మవుతుందని కూడా శాస్త్రీయ పరిశోధనల వల్ల తెలిసింది.
పైన మనం చదివాము కదా ఈ డ్యాష్ డైట్ లో ఏ ఏ పదార్ధాలు,ఎక్కువ గా వాడాలో , అంటే తినాలో , అలాగే ఏ ఏ పదార్ధాలకు మనం దూరం గా ఉండాలో తెలుసుకున్నాము కదా ! వచ్చే టపాలో మనం ఎంతెంత ఈ పదార్ధాలు రోజూ తినవచ్చో కూడా తెలుసుకుందాము