DASH diet , డ్యాష్ డైట్ లో రోజు వారీ క్యాలరీ లక్ష్యాలు. 26.

Daily Nutrient Goals Used in
the DASH Studies
(for a 2,100 Calorie Eating Plan)
Total fat 27% of calories Sodium 2,300 mg*
Saturated fat 6% of calories Potassium 4,700 mg
Protein 18% of calories Calcium 1,250 mg
Carbohydrate 55% of calories Magnesium 500 mg
Cholesterol 150 mg Fiber 30 g
* 1,500 mg sodium was a lower goal tested and found to be even better for
lowering blood pressure. It was particularly effective for middle-aged and older
individuals, African Americans, and those who already had high blood pressure.
g = grams; mg = milligrams.
మనం క్రితం టపాలో చదివాము కదా, డ్యాష్ డైట్ మూల సూత్రాలు. ఇప్పుడు మనం అది ఎలా మన నిత్య జీవితం లో అమలు చేయ వచ్చో పరిశీలిద్దాము వివరంగా .
ఇందుకు మనకు ముఖ్యం గా కొన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన ఉండాలి .
అంటే మనకు రోజూ కావలసిన క్యాలరీలు, ఆ క్యాలరీలు మనం రోజూ తినే ఆహారం లో ఏ ఏ పదార్ధం నుంచి ఎన్నెన్ని క్యాలరీలు పొందాలి ? అనే విషయం మనకు తెలిసి ఉండాలి. మన జీవితాలు మనం చాలా ఖచ్చితం గా త్రాసులో పెట్టి కొలిచి జీవించము, జీవించలేము కదా ! కానీ మనకు రమా రమి గా అంటే రఫ్ ఎస్టిమేట్ మనం రోజూ ఎన్ని క్యాలరీలు ఏ ఏ ఆహార పదార్ధం నుంచి తీసుకోవాలి అనే విషయం తెలిస్తే , తదునుగుణం గా మనం ఒక కంట్రోలు ఏర్పరుచుకోగలం, మన ఆహారం మీద.
ఇలా జరగలేదనుకోండి. అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఉదాహరణకు చూద్దాము. మనం సరిపోయినన్ని క్యాలరీలు కలిగిన ఆహారం రోజూ తినక పొతే, మనం రోజూ చేస్తున్న పనులకు సరిపడినంత శక్తి లభించదు. అప్పుడు మనం బలహీన పడతాము.
కానీ మనం అతి జాగ్రత్త గా , బలహీన పడతామేమో అని రోజూ ఎక్కువ క్యాలరీలు కల ఆహారం కనక తిన్నట్టయితే, మన ఆహారం లో ఉన్న ఆ ఎక్కువ క్యాలరీలు కాస్తా ఫ్యాట్ స్టోర్స్ గా మార్చుతాయి మన దేహాన్ని. దానితో మన బరువు అతి బరువు గా మారి, సమస్యలు సృష్టించు తాయి.
అలాగే క్యాలరీలు మనం తినే ఆహారం లో కార్బో హైడ్రేటు అంటే పిండి పదార్ధాల రూపం లోనూ , ప్రోటీనుల రూపం లోనూ , కొవ్వు పదార్ధాల రూపం లోనూ కొన్ని నియమిత పాళ్ళలో అంటే ( right proportions ) , ప్రపోర్శన్స్ లో అంటే నిష్పత్తి లో తీసుకోవాలి.
ఒక ఉదాహరణకు రోజూ మనం రెండు వేల ఒక వంద క్యాలరీలు ఖర్చు చేస్తామనుకోండి మనం చేసే వివిధ పనులలో. అప్పుడు వివిధ ఆహార పదార్ధాలు పైన చూపిన విధం గా వివిధ నిష్పత్తులలో ఉండాలి.
ఇక్కడ కూడా సోడియం ప్రాముఖ్యత మళ్ళీ చెప్పబడింది అంటే మన ఆహారం లో ఉప్పు లేక సోడియం ను తక్కువ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు. ఇక్కడ మనం ఈ డ్యాష్ డైట్ ను ప్రత్యేకించి అధిక రక్త పీడనాన్ని తక్కువ చేసుకోవడానికి , తింటున్నామని గుర్తు చేసుకోవాలి. గుర్తు ఉంచుకోవాలి కూడా !
రక్త పీడనాన్ని తగ్గించడం లో పొటాసియం ప్రాముఖ్యత ఇటీవలి పరిశోధనలలో స్పష్టంగానూ , ఖచ్చితం గా నూ తెలిసింది. మనం తినే ఆహారం లో పొటాసియం లోపిస్తే, వివిధ జీవ రసాయన చర్యల ద్వారా , రక్త పీడనాన్ని పెంచుతుంది.
ఇంకో విషయం : ఈ పొటాసియం లోపాన్ని మనం తినే ఆహార పదార్ధాల మార్పు తోనే సరిచేయడం అత్యుత్తమం అని కూడా శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు.
వచ్చే టపాలో రోజూ ఎన్ని సర్వింగ్స్ అంటే ఎంత పరిమాణం లో ఆహారం ఎన్ని సార్లు , ఏ ఏ ఆహారం గా తిన వచ్చో పరిశీలిద్దాము.
టపా నచ్చితే http://www.baagu.net. గురించి తెలపండి.