గుండె జబ్బు నివారణకు ఇంకో రెండు రక్త పరీక్షలు. 20.
Lipoprotein a test. లైపో ప్రోటీన్ ఎ లెవెల్స్ టెస్ట్ :


మనం మునుపటి టపాలలో వివరం కా తెలుసుకున్నాము కదా చెడు కొలెస్టరాల్ గురించి. లైపోప్రోటీన్ ఎ, ఈ చెడు కొలెస్టరాల్ LDL కొలెస్టరాల్ కు చెందుతుంది.
పైన ఉన్న మొదటి చిత్రం చూడండి ఈ లైపోప్రోటీన్ ఎ అణువు ఎంత అందం గా ఉందొ. కానీ ఈ అందమైన లైపోప్రోటీన్ ఎ అణువు మన ఆరోగ్యానికి ఎంత హానికరమో రెండవ చిత్రం లో ఒక కార్టూన్ రూపం లో చూప బడింది. ఈ కార్టూన్ లో రక్త నాళం లోపలి గోడలలో అతుక్కుని కూర్చున్న రాక్షసి లాంటి LDL కొలెస్టరాల్ ను ప్రక్కనే ఉండి రక్తనాళం గోడలను అంటే ఇంటిమా ను ‘ శుభ్రం’ చేస్తున్న HDL కొలెస్టరాల్ నూ గమనించ వచ్చు.
మన దురదృష్టం ఏమిటంటే మనలో ఈ LDL కొలెస్టరాల్ ఎంత ఉండేదీ మన జీన్స్ అంటే జన్యువులు నిర్ణయిస్తాయి. అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. మనం ఏమైనా చేయగలిగితే, ఈ లైపోప్రోటీన్ ఎ లెవెల్ ఎంత ఉందొ పరీక్ష చేయించుకుని , ఎక్కువ గా ఉంటె తగు జాగ్రత్తలు తీసుకోవడమే కదా !
BNP test or B type Natri Uretic Peptide test బీ ఎన్ పీ పరీక్ష లేదా బీ టైపు నెట్రి యురెటిక్ పెప్టైడ్ పరిక్ష :
ఈ పరీక్ష లో BNP అనే రసాయనం పరిమాణం మన రక్తం లో ఎంత ఉందొ కొలిచి, దాని ద్వారా మన గుండె జబ్బు తీవ్రత కనుక్కుంటారు.
ఈ BNP ఎక్కడ నుంచి వస్తుంది ? : ఇది అత్భుతమైన ప్రకృతి చిత్రాలలో ఒకటి అనుకోవచ్చు.
ఎందుకంటే , గుండె జబ్బు వచ్చినప్పుడు , గుండె నుంచీ , ఇంకా మనలో ఉన్న రక్తనాళాల నుంచీ విడుదల అయే ఈ BNP, అనవసరమైన ద్రవాలను మూత్రము ద్వారా పంపించి , మన రక్తం పరిమాణం లో మార్పులు తీసుకువచ్చి , తద్వారా గుండె చేసే పనిని తగ్గించి , గుండె కు తగు విశ్రాంతి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ BNP హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా విడుదల అవుతుంది. గుండె జబ్బు తీవ్రం గా ఉంటె , ఎక్కువ గానూ విడుదల అవుతుంది.
ఈ BNP గుండె జబ్బు వల్ల వచ్చే ఆయాసం , లేక ఊపిరితిత్తుల జబ్బుల వల్ల వచ్చే ఆయాసం లో తేడా కనుక్కోవడానికి కూడా ఉపయోగ పడుతుంది. ఎందువల్ల నంటే ఈ BNP ఎక్కువ గా విడుదల అయేది గుండె జబ్బు లోనే !
క్రింద చిత్రం లో చూడండి ఈ BNP ఏ పరిస్థితులలో విడుదల అవుతుందో !

వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !