గుండె జబ్బు నివారణ కు మిగతా రక్త పరీక్షలు ఏమిటి ? ఎందుకు ? .17.
క్రితం టపాలో మనం గుండె జబ్బుల నివారణలో ఫాస్టింగ్ కొలెస్టరాల్ పరీక్ష ప్రాముఖ్యత తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మిగతా ముఖ్యమైన పరీక్షలు కూడా ఏమిటో , ఆ పరీక్షలు మనకు గుండె జబ్బు గురించి ఏమి చెబుతాయో కూడా తెలుసుకుందాము.
1. C – reactive protein , లేక సి – రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్.
2. Fibrinogen levels test. లేక ఫైబ్రినోజెన్ లెవెల్స్ టెస్ట్.
3.Homocysteine levels test. హోమో సిస్టీన్ లెవెల్స్ టెస్ట్.
4.Lipoprotein ‘ a ‘ levels test. లేక లైపో ప్రోటీన్ లెవెల్స్ టెస్ట్.
5. Natriuretic peptides. లేక నెట్రి యురెటిక్ పెప్ టైడ్ లెవెల్స్ టెస్ట్.
6. HbA1C test.
1. C – reactive protein , లేక సి – రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్. : ఈ ప్రోటీన్ మన కాలేయం అంటే లివర్
( liver ) లో ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడంటే , మన దేహం లో ఏదైనా గాయం ఉన్నప్పుడు, అంటే ఆ గాయం బయటకు కనిపించేదే ఆవ నవసరం లేదు. ( పైన ఉన్న C – reactive protein చిత్రం చూడండి. )
అలాగే, మన దేహం లో ఎక్కడైనా, ఇన్ఫెక్షన్ కానీ ( infection ) , ఇన్ఫ్లమేషన్ అంటే inflammation ఉన్నప్పుడు. గుండె జబ్బుకు సంబంధించిననంత వరకూ , ప్లేక్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నాము కదా మునుపటి టపాలలో పటం సహాయం తో ! అలా జరిగినప్పుడు కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ విడుదల అవుతునుందన్న మాట. అంటే ఎక్కడైనా గాయం మానేటప్పుడు.
C – reactive protein , లేక సి – రియాక్టివ్ ప్రోటీన్ నార్మల్ లెవెల్స్ ఏమిటి ? :
లీటర్ కు ఒక మిల్లీగ్రాము కన్నా తక్కువ ఉంటె గుండె జబ్బు రిస్కు తక్కువ ఉన్నట్టు.
( low risk if less than 1 milligram per litre ).
లీటర్ కు ఒకటి నుంచి మూడు మిల్లీ గ్రాముల మధ్య ఉంటె యావరేజ్ రిస్కు అంటే ఒక మాదిరిగా రిస్క్ ఉన్నట్టు. ( average risk if the levels are between 1 and 3 milligrams per litre )
లీటర్ కు మూడు, అంతకు మించీ ఉంటే వారికి గుండె జబ్బు వచ్చే రిస్కు ఎక్కువ గా ఉన్నట్టు.
( High risk if levels are 3 or above 3 milli grams per litre ).
ఈ పరీక్ష ఎవరు చేయించుకోవాలి ? : అమెరికన్ హార్ట్ అసోసి ఎషన్ ఈ పరీక్షను గుండె జబ్బులు వచ్చే రిస్కు ఎక్కువ గా ఉన్న వారే చేయించుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఈ పరీక్ష అందరూ చేయించు కొనవసరం లేదు.
2. Fibrinogen levels test. లేక ఫైబ్రినోజెన్ లెవెల్స్ టెస్ట్.:
ఫైబ్రినోజేన్ అంటే ఏమిటి ? : ఇది మన రక్తం లో ఉండే ఒక ప్రోటీన్. రక్తం గడ్డ కట్టే క్రియ లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే బ్లడ్ క్లాటింగ్ ( blood clotting ). ఈ ఫైబ్రినోజెన్ సహజం గా మనందరిలోనూ ఒక నిర్ణీత పరిమాణం లో ఉంటుంది. ఎక్కువ గా ఉంటే రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
కొన్ని ప్రత్యెక పరిస్థితులలో ఈ ఫైబ్రినోజెన్ దేహం లో ఎక్కువ అవుతుంటుంది.
స్మోకింగ్ చేసే వారిలోనూ , మద్యపానం ఎక్కువ గా చేసే వారిలోనూ, ఈస్త్రోజేన్ ( estrogen containing drugs or contraceptive pills ) ఉన్న మందులు తీసుకునే వారిలోనూ, వ్యాయామం అసలే చేయక, అతి తక్కువగా కదిలే వారిలోనూ , ఈ ఫైబ్రినోజెన్ పరిమాణం ఎక్కువ అవుతుంది. ఇలా ఎక్కువ అయిన ఫైబ్రినోజెన్ కరోనరీ ధమనులలో కూడా రక్తాన్ని గడ్డ కట్టించి ( అంటే ప్లేక్ దిస్రప్షన్ జరిగినప్పుడు , మనం చూశాము కదా , మునుపటి టపాలలో , దీని గురించి కూడా , పటం సహాయం తో ! ) , గుండె పోటు కు కారణం అవుతుంది.
అలాంటి పరిస్థితులలో , వారు ఫైబ్రినోజెన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
( కింద ఉన్న అత్భుతమైన ఎలెక్ట్రాన్ ఫోటో లో ఫైబ్రిన్ మన దేహం లో రక్తం గడ్డ కట్టడానికి ఎర్ర రక్త కణాల మీద ఒక వల లా ఏర్పడుతుందో ! మన దేహం లోని ఈ అత్యంత సహజమైన బ్లడ్ క్లాటింగ్ చర్య , సమ తూకం లోనే జరగాలి ఎక్కువగా జరిగితే గుండె కు హానికరం. తెల్లటి పోగుల రూపం లో ఉన్నది ఫైబ్రినోజెన్ నుంచి జనించిన ఫైబ్రిన్ పోగులు. గుండ్రం గా ఎర్రగా ఉన్నవి మన ఎర్ర రక్త కణాలు )

మిగతా పరీక్షల గురించి కూడా వచ్చే టపాలో తెలుసుకుదాము !