Our Health

గుండె జబ్బు నివారణలో హోమోసిస్టీన్ ( homocysteine ) పరీక్ష ఎందుకు ?.18.

In Our Health on మే 7, 2012 at 10:27 సా.

 గుండె జబ్బు నివారణలో హోమోసిస్టీన్ పరీక్ష ఎందుకు ?.18.

రక్త పరీక్షలు మనలో అత్యంత తొలి దశలలో వ్యాధులు కలిగించే సూక్ష్మమైన మార్పులు తెలిపి,  భవిష్యత్తు లో మన ఆరోగ్య నిర్దేశన చేసే టెలిస్కోపులు !  

మనం క్రితం టపాలో కొన్ని రక్త పరీక్షలు, ముందుగా చేయించుకుంటే, మనకు గుండె జబ్బు లక్షణాలను ఎట్లా కనిపెడతాయో  చూశాము కదా ! గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ రక్త పరీక్షల వల్ల , మన దేహం లో, రక్త నాళాల లో చాలా ముందుగా జరిగే మార్పులు మనకు తెలుస్తాయి. అంటే  కొన్ని దశాబ్దాల క్రితం మాదిరిగా జబ్బు ముదిరే దాకా వేచి ఉండనవసరం లేదు.  శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ , అతి సున్నితమైన పరీక్షలు, అవి రక్త పరీక్షలు కానీయండి , వేరే  ఇమేజింగ్ పరీక్షలు కానీయండి , చాలా మనకు అందుబాటు లోకి వచ్చాయి. ఇక మనం చేయవలసిందల్లా తగు జాగ్రత్త లు తీసుకోవడమే ! లేక తక్షణ వైద్య సహాయం తీసుకోవడమో ! ఈ రెండు పనులు చేయడానికీ మనకు ఈ పరీక్షల గురించి తెలియాలి కదా !  ఆ అవగాహన కలిగించడానికే ఈ ప్రయత్నం !
3.Homocysteine levels test. హోమో సిస్టీన్ లెవెల్స్ టెస్ట్ : 
హోమో సిస్టీన్ కధ ఏమిటో చూద్దాము ఇప్పుడు :  మన దేహం లో 22 రకాల అమీనో యాసిడ్స్ ఉంటాయి.  అందులో 9 అంటే తొమ్మిది రకాల అమీనో యాసిడ్స్ ను మనం ఎసెన్షియల్  అమీనో యాసిడ్స్ అంటాము. ఎందుకంటే ఈ తొమ్మిదీ మన దేహం లో తయారు కాలేవు.  కానీ మనకు ఇవి చాలా ముఖ్యం. అందువల్ల మనం మన ఆహారం లో ఈ తొమ్మిది అమీనో యాసిడ్స్ నూ తీసుకోవాలి.  ఈ హోమోసిస్టీన్ అనే అమీనో యాసిడ్ ,  రూపాంతరం చెందిన సిస్టీన్ అనే అమీనో యాసిడ్. ఒక రకం గా చెప్పుకోవాలంటే ఈ హోమోసిస్టీన్ కూడా ఎసెన్షియల్ అమీనో యాసిడ్ కోవ కు చెందుతుంది.
ఇటీవలి పరిశోధనల వల్ల ఈ హోమోసిస్టీన్  గుండె జబ్బులలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిసింది.
ఒక్క ముక్క లో చెప్పాలంటే ఈ హోమోసిస్టీన్  మన రక్త నాళా లను ‘  కరోడ్ ‘ చేసే జీవ రసాయనం.
  ( homocysteine is a biological corrosive ) 
మనకు మన  నిత్య జీవితం లో , ఇనుము ‘ తుప్పు ‘ పట్టడమూ, లేక రాగి పాత్రలు చిలుము పట్టడమూ , అనుభవం లోనిదే కదా ! అలాగే  మన రక్త నాళాల లోపలి ‘ గోడలను ‘  ( ఇంటిమా – intima ,  అని మనం క్రితం టపాలలో పటం సహాయం తో తెలుసుకున్నాము ), వివిధ రసాయన చర్యలతో  ఈ హోమోసిస్టీన్  బలహీనం చేస్తుందని  తెలిసింది.  పై చిత్రం లో  ఈ హోమో సిస్టీన్   ఉదాహరణకు ఒక  కరోనరీ ధమని గోడను  ఎలా ‘ చీల్చుతుందో ‘ చూపబడింది. ఇది అత్యంత సూక్ష్మమైన చీలిక అయినా , ఆ చీలిక తరువాత  అక్కడ జరిగే మార్పులు , అంటే అక్కడ ‘ చెడు కొవ్వు పేరుకోవడమూ, తదనంతరం ,  ప్లేక్ ఫార్మేషన్ అంటే ఒక ‘ పెచ్చు ‘ ఏర్పడడమూ, ఆ తరువాత ఆ పెచ్చు ఊడి పోయి , ఆ ప్రాంతం లో రక్తస్రావం జరగడమూ, అప్పుడు అక్కడ రక్తం గడ్డ కట్టడమూ,  అంటే త్రాంబస్ ఏర్పడడమూ ,  అప్పుడు ఆ రక్తనాళం పాక్షికం గానో  , లేక సంపూర్ణం గానో మూసుకు పోయి , యాంజైనా కానీ , హార్ట్ ఎటాక్ కానీ కలిగించడమో  జరుగుతాయి.  ఇప్పుడు మనకు అవగాహన అయింది కదా ఈ హోమోసిస్టీన్ మన రక్త నాళాలను ఏ విధం గా ‘ తుప్పు ‘  లేక ‘ చిలుం ‘  పట్టిస్తుందో !
ఈ హోమోసిస్టీన్  నార్మల్ లెవెల్స్ ఏమిటి ?: 
4.4 to 10.8 micromols per litre అంటే  4.4 నుంచి 10.8 మైక్రో మోల్స్ పర్ లీటర్.
ఎవరు చేయించుకోవాలి ఈ హోమోసిస్టీన్ టెస్ట్ ? :  ఈ పరీక్ష కూడా గుండె జబ్బు కు రిస్కు ఫ్యాక్టర్లు ఉన్న వారు చేయించుకోవాలి. ( మునుపటి టపాలో తెలుసుకున్నాము కదా చాలా వివరం గా ఈ రిస్కు ఫ్యాక్టర్ల గురించి ! )
4.Lipoprotein ‘ a ‘ levels test. లేక లైపో ప్రోటీన్ లెవెల్స్ టెస్ట్. ( దీని గురించి వచ్చే టపాలో తెలుసుకుందాము ) 
( ఈ టపా నచ్చితే మీ స్నేహితులకు  www.baagu.net. గురించి తెలియచేస్తారు కదూ ! )
  1. గుండెకు/ బీపీకి సంబంధించి ఇప్పటివరకు మీరు చేసిన పోస్ట్ లన్నీ చదివాను… బీపీ కంట్రోల్ చేసుకోక పోతే కలిగే అనర్ధాల గురించి తెలియచేశారు. పోస్ట్ లన్నీ సచిత్రం గా సామాన్యులకు అర్ధమయ్యేరీతిలో ఉన్నాయి…అందుకు ధన్యవాదాలు. అయితే హైబీపీ ఎలా కంట్రోల్ చెయ్యలి అనే దాని పై కూడా ఒక పోస్ట్ రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం…

    • శ్రీనివాస బాబు గారూ,
      మీ ఈమెయిలు కూ , మీ అభిప్రాయాలకూ ధన్య వాదాలు. అన్ని టపాలూ శ్రద్ధ గా చదువుతూ, కొంతైనా లాభపడుతుంటే, సంతోషం.
      మీ విలువైన సలహా గమనించాను. ఇప్పుడు మనం గుండె జబ్బులు అశ్రద్ధ చేస్తే ఏమవుతుందో చూశాము , రిస్కు ఫ్యాక్టర్లు చూశాము.
      పరీక్షలు చూస్తున్నాము కదా. చికిత్సా పద్ధతులు కూడా త్వరలో తెలుసుకుందాము. అప్పుడు అధిక లేక హై బీపీ ని ఎట్లా కంట్రోలు చేసుకోవాలో కూడా తెలుసుకుందాము , తప్పకుండా !
      మీరు మీ అభిప్రాయాలను ఇలాగే తెలియ చేస్తూ ఉంటారని ఆశిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: