ACS అంటే యాంజైనా, హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏమిటి ?.11.
మనం ఇంత వరకూ , ఎక్యూట్ కరోనరీ సిండ్రోం లేక ACS or Acute Coronary Syndrome లో గుండె కు సరఫరా చేసే రక్త నాళాల లో అంటే ధమనులలో జరిగే మార్పులు వివరం గా తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు అలాంటి మార్పులు ఎట్లా కనిపిస్తాయో , లేక ఎట్లా అనుభవం అవుతాయో కూడా తెలుసుకుందాము. ఈ విషయాలు కూడా అందరూ ఉత్సాహం తో తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా ఉపయోగ పడవచ్చు.
ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం. ఈ ACS సంభవించినప్పుడు, మనం సమయానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఈ మార్పులు, మనం గమనించినా, అనుమానించినా, వెంటనే వైద్య సహాయం అందేట్టు చూడాలి. ఎందుకంటే, అత్యంత ఆధునిక చికిత్సా పద్ధతులతో, ACS లో జరిగే మార్పులను నియంత్రించి, మరణాలను నివారించ డమూ , లేక చాలా వరకూ తగ్గించడమూ చేయ వచ్చు. అందుకే ఇలాంటి మార్పులు జరిగిన వెంటనే ఉన్న అరవై నిమిషాలనూ , గోల్డెన్ అవర్ ( golden hour )అంటారు. అంటే ఈ బంగారు గంట లో మనం తీసుకునే చర్యలూ , అందే సహాయమూ , ఎంతో విలువైనవి ! సరి అయిన సమయం లో సరి అయిన చికిత్స కు అందుకే అంత ప్రాముఖ్యత !
ఇక ACS లక్షణాలు ఎలా కనిపిస్తాయి? :
ఈ లక్షణాలను మనం వివరంగా తెలుసుకుందాము. ప్రధానం గా గుండె నొప్పి , లేక చాతీ లో నొప్పి. ఈ గుండె నొప్పి కాక, అనుభవించే మిగతా లక్షణాలు.
మనకు తెలుసు కదా ! ACS లో కరోనరీ ధమనులు కొన్ని మార్పులకు లోనవుతాయని. ఈ మార్పుల తీవ్రత బట్టి , బయటకు కనిపించే లక్షణాలు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు పై పటం చూడండి. అందులో గుండెకు రక్తం సరఫరా చేసే ఈ కరోనరీ ధమనులు పాక్షికం గా నూ, లేక సంపూర్ణం గానూ మూసుకుంటే ఎలా కనిపిస్తాయో చక్కగా చూపబడింది.
వచ్చే టపాలో ముందు గా స్త్రీలలో ఈ ACS లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాము !
రక్తనాళాలు పూర్తిగా మూసుపోయక ఏ గుండె నొప్పో వచ్చి తెలుసుకోకుండా ముందే మనలోని ధమనులు, సిరలు ఎంత మేరకు పూడుకుపోయాయో ఎలా తెలుసుకోవడం?
మంచి ప్రశ్న అడిగారు శరత్ గారూ,
యాంజియోగ్రాం అంటారు ఆ పరీక్ష తో తెలుసుకోవచ్చు. దాని గురించి కూడా మనం వివరం గా తెలుసుకుందాం ముందు ముందు టపాలలో.
అప్పుడు కూడా సందేహాలుంటే తప్పక తెలియ చేయండి.