Stress, అంటే మానసిక వత్తిడి తో గుండె జబ్బులు ఎట్లా వస్తాయి?.4.
గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కాలం నుంచి మన మనో భావాలకు కేంద్రకం మన హృదయం లేక గుండె అని భావించ బడేది. మన పురాతన హిందూ గ్రంధాలలో కూడా అలాగే గుండె కు మన ఎమోషన్స్ అంటే భావోద్వేగాలకు సంబంధం ఉందని వ్రాయ బడ్డది.
రోమన్ తత్వవేత్త సెల్సస్ కూడా మనం తీవ్రం గా భయ పడినప్పుడు కానీ , మనకు విపరీతం గా కోపం వచ్చి నప్పుడు కానీ, లేక ఏ ఇతర ఏవిధమైన భావోద్వేగాలకు లోనైనా, వాటి పరిణామాలు మన నాడి లేక పల్స్
( pulse ) ను ఉత్తేజ పరుస్తాయని మొదటి సారిగా ప్రపంచానికి తెలియ చేశాడు.
మానవులలో రక్త ప్రసరణ గురించి పరిశోధనలు మొదట గా చేసిన విలియం హార్వే 1628 A.D. లో ఇలా వ్రాశాడు.
‘ మానవుల మస్తిష్కాలలో ఉద్భవించే ప్రతి భావోద్వేగమూ , అది క్రోధం కానీ, భయం కానీ, బాధ కానీ, సంతోషం కానీ , ఆశ కానీ – వారి గుండె కు అంటే హృదయానికి , ఒక విధమైన ఆందోళన లేక యాజి టేషన్ ( agitation ) రూపం లో పాకుతుంది ‘
జాన్ హంటర్ అని ఇంకో శాస్త్ర వేత్త కు యాన్జైనా ( angina ) ఉండేది. ఈ విషయం కనీసం రెండు వందల ఏళ్ళ క్రితం మాట. తన ఆరోగ్యం గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు ‘ నా ఆరోగ్యం నన్ను కోపం విసిగించి , హేళన చేసే ఎవరో ఒక వెధవ చేతిలో ఉంది ‘
ఇలా అన్న కొన్ని ఏళ్లకు నిజంగానే తన సహచరుడి తో ఒక సందర్భం లో తీవ్ర వాగ్వివాదానికి దిగి , తీవ్ర మైన గుండె పోటు వచ్చి మరణించాడు.
క్యారెక్టర్ యాక్టర్ గా పేరుపొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒక సారి ఇలా అన్నారు. ‘ గత నలభై సంవత్సరాల నుండి నేను సినిమాలలో ‘ చస్తూ ‘ బతుకుతున్నా ! ‘ ( ఆయన తండ్రి పాత్రలలో , ప్రత్యేకించి అమ్మాయి లకు తండ్రిగా అత్భుతం గా నటించే వారు. అలాగే తీవ్ర మైన భావోద్వేగానికి లోనైనట్టూ , గుండె పోటు ను అనుభ విస్తున్నట్టూ నటించడం లో ప్రసిద్ధి ).
మనం ఇక లేటెస్ట్ అంటే తాజా గా జరిగిన లేక జరుగుతున్న పరిశోధనల వల్ల మనకు ఎంత వరకు తెలిసింది ?,
Type A Personality traits టైపు ఏ వ్యక్తిత్వం లక్షణాలు ఏమిటి ? ఈ లక్షణాలకూ గుండె జబ్బులకూ సంబంధం ఏమిటి అనే విషయాన్ని వచ్చే టపాలో చూద్దాము !
Hi, I have one doubt regarding cardio tests. If 2d echo and tmt tests are normal next time after how much time we have do again?. Is it 6 months ?. If mental stress is there after normal 2d echo and tmt is there chance that heart problem will occur within 6 months of time?
Thanks for visiting baagu. I am glad that your recent test results were all normal.
I am sure these tests were suggested to you by a cardiologist. ( I am not a cardiologist ). Further details were not mentioned in your email.
If you do not have any risk factors, ( like smoking, alcohol,diabetes,previous history of angina or heart attack, or hypertension or any kidney disease ) you may not need to repeat the tests that frequently. Stress automatically does not worsen the illnesses. Only if stress is severe, and remains most of the day, for a prolonged period, then you must seek advice from specialist. I hope this helps you. Also, please follow further posts to see if they help you managing stress.
best wishes.
thank you so much sir. Earlier I was in some doubt that whether mental cause immediate effect.
*correction to above comment: *mental stress
No worries. I hope you keep following the posts to clear your doubts. Also, Your ‘ baagu ‘ will help you acquire more knowledge about our health matters.