బీ పీ కంట్రోలు కాకపొతే ….
ఇంతకు ముందు టపాలో మనం సాధారణం గా వత్తిడి లేక పీడనం గురించి తెలుసుకున్నాము. మనం గుండె ప్రధానం గా మన శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని పంపు చేస్తుందని కూడా తెలుసుకున్నాము.
ఇలా రక్తాన్ని పదే పదే ఎందుకు పంపు చేయాలి గుండె ? అలాగే పదే పదే రక్తం మళ్ళీ గుండె లోకి ఎందుకు చేరుకోవాలి? ఎప్పుడైనా ఈ సందేహం మీకు వచ్చిందా?
ఎందుకంటే, మన దేహం లో ప్రతి భాగానికీ ఆక్సిజెన్ అంటే ప్రాణ వాయువు కావాలి. ఇంకా సూటి గా చెప్పాలంటే, నిరంతరం కావాలి. మన దేహం లోని ప్రతి కణానికీ ప్రాణ వాయువు నిరంతరం అవసరం.
మనం పీల్చే గాలి లోని ఆక్సిజెన్ మన ఊపిరి తిత్తుల ద్వారా , రక్తం లో కలుస్తుంది. ఆ రక్తం గుండెలోకి చేరుకొని, దేహం లో అన్ని భాగాలకూ పంపు చేయ బడుతుంది. అలాగే, మలినాలు మన శరీరం లోని అన్ని భాగాలనుంచీ మళ్ళీ రక్తం ద్వారా, ఊపిరి తిత్తులకు చేరుకొని, అక్కడ, మళ్ళీ శుభ్ర పరచ బడ్డ రక్తం మళ్ళీ గుండెకు చేరుకుంటుంది. అంటే గుండె నుంచి సరఫరా ఆయే రక్తంలో ఎక్కువ ఆక్సిజెన్ ఉంటుంది. గుండె కు తిరిగి వచ్చే రక్తం లో ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది.
ఇప్పుడు మానవులలో రక్త పీడనం లేక బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుందాము.

ఈ రక్త పీడనాన్ని పాదరసం లేక మెర్క్యురీ తో కొలుస్తారు కాబట్టి, ఇంకా విపులం గా చెప్పాలంటే, బీ పీ ను చెక్ చేసే పరికరం సాధారణం గా చారిత్రకం గా పాదరసం తో తయారు చేయ బడి ఉండేవి కాబట్టి, ఆ పాదరసం మన ఆర్టరీ లేక ధమని లోని రక్త పీడనానికి స్పందించి , సన్నని గాజు నాళికలలో ఎంత పైకి వెళుతుందో, ఆ ఎత్తును మిల్లీ మీటర్లలో చెపుతారు. అంటే చెప్పేటప్పుడు ఉదాహరణ కు 120 బై 80 మిల్లీ మీటర్స్ అఫ్ మెర్క్యురీ అని చెపుతారు. దానినే ఇలా సూచిస్తారు : 120/ 80 mm of Hg ( Hg అంటే పాదరసం యొక్క రసాయన నామం పూర్తిగా hydrarginum లేక హైడ్రార్జినం ) కానీ భారత దేశం లో చాలా మంది వైద్యులు కేవలం 120 / 80 అని మాత్రమే రాస్తుంటారు ఎక్కడ రాసినా !
సాధారణం గా బీ పీ ని అంటే బ్లడ్ ప్రెషర్ ను సిస్టోలిక్ ఇంకా డయా స్టోలిక్ బీ పీ అని రెండు రకాలైన బీ పీ గా చెపుతుంటారు, దీనిని ఒక దాని మీద ఒకటి వేసి అంటే పైన ఉన్న పీడనం లేక వత్తిడి సిస్టోలిక్ పీడనం, క్రింద చూపించే వత్తిడి డయా స్టోలిక్ పీడనం.
ఈ రెండు రకాలు గా ఎందుకు చేపుతారంటే గుండె కొట్టుకుంటున్నప్పుడు, ( అంటే సంకోచం లేక కాంట్రా క్షన్ జరుగు తుండే సమయం లో ) అంటే పంపు చేస్తున్నప్పుడు, సరఫరా ఆయే రక్తం అన్ని భాగాలకూ చేరాలంటే ఎక్కువ పీడనం అవసరం. ఆ పీడనమే పైన చూపించ బడుతున్న పీడనం. డయా స్టోలిక్ పీడనం సమయం లో గుండె వ్యాకోచించడం వల్ల రక్త నాళాలలో పీడనం లేక వత్తిడి తక్కువ గా ఉంటుంది అందు వల్ల క్రింద సూచించే పీడనం ఎప్పుడూ సిస్టోలిక్ లేక పైన చూపించిన పీడనానికన్నా తక్కువ గా ఉంటుంది.
ఈ పైనా క్రిందా సూచించ బడే రెండు రక్త పీడనాలూ మనకు ముఖ్యమైనవే ! ఇప్పుడు క్రింద పటం లో చూడండి. అడల్ట్ అంటే వయోజనులలో సామాన్యం గా ఉండ వలసిన రక్త పీడనం, ఎప్పుడు హై బీ పీ లేక హైపర్ టెన్షన్ గా పిలవ బడుతుందో ,( అంటే రక్త పీడనం లేక రక్త పోటు ).

ఇపుడు మనలో రక్త పీడనం గురించి కొంత తెలుసు కున్నాము కదా ! వచ్చే టపా లో మనలో రక్త పీడనం కంట్రోలు లో లేకుండా ఎక్కువ గా ఉంటే మానవులలో పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాము.
good and informative. continue like this
I am following your blog regularly. thank so much for all the information. I am looking forward to know more info about cardio vascular diseases.
Thanks. keep following the posts and let me know if you still need more info.