Our Health

సర్వైకల్ క్యాన్సర్.9. అతి ముఖ్యమైన నివారణ చర్యలు.

In Our Health on ఏప్రిల్ 21, 2012 at 10:54 ఉద.

HPV/LSIL On Pap Smear ThinPrep liquid-based Pa...

HPV/LSIL On Pap Smear ThinPrep liquid-based Pap. Normal squamous cells on left; HPV-infected cells with mild dysplasia (LSIL) on right. See also File:Low-Grade SIL with HPV Effect.jpg - Another example of LSIL with HPV changes. File:High-Grade SIL.jpg - High-grade squamous intraepithelial lesion (HSIL). (Photo credit: Wikipedia)

సర్వైకల్ క్యాన్సర్.9. అతి ముఖ్యమైన నివారణ చర్యలు:

 సర్వైకల్ క్యాన్సర్ గురించి రాసిన అన్ని టపా ల సారాంశం,  పై పటం చెపుతుంది మీకు, ఒక్క వాక్యం లో !
మునుపటి టపాలో రెండు నివారణ చర్యల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మిగతా రెండు అతి ముఖ్యమైన నివారణ చర్యలు ఏమిటో వివరం గా తెలుసుకుందాము.
3.సర్వైకల్  స్క్రీనింగ్  : స్మియర్ టెస్ట్ అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ ద్వారా  ఒక క్రమ పధ్ధతి లో  సర్విక్స్ కు చెందిన కణాలను పరీక్షించడం  ఇప్పటి వరకూ  అందుబాటు లో ఉన్న వాటి లో ఉత్తమమైన పధ్ధతి.
క్రితం టపాలలో వివరించినట్టు , HPV వైరస్ చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్. కానీ  కేవలం కొద్ది మంది లో మాత్రమే  ఈ ఇన్ఫెక్షన్, సర్వైకల్ కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చి, సర్వైకల్ క్యాన్సర్ కు కారణ మవుతుంది. ఆ కొద్ది మంది, రతి క్రియా  జీవితం అంటే సెక్స్ పరంగా  యాక్టివ్ గా ఉంటున్న వారు ఎవరైనా కావచ్చు. అంటే  ఎవరిలో ఎప్పుడు  సర్వైకల్ కణాలు మార్పు చెందుతాయో  ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయకుండా కనుక్కోవడం అసాధ్యం.  అందువల్లనే ఈ ప్యాప్ స్మియర్ ప్రాముఖ్యత పొందింది.
స్మియర్ టెస్ట్ ఎప్పుడు చేయించు కోవాలి? : 
పాశ్చాత్య దేశాలలో, ఆ దేశాలకు చెందిన ప్రతి సిటిజెన్  కూ  ఆరోగ్య పరం గా ఏ పరీక్షలు ఏ సమయం లో చేయించుకోవాలో  ఆ దేశం యొక్క ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నిర్ణయించి తదనుగుణం గా  వారికి సలహా ఇచ్చి పరీక్షలు చేయిస్తుంది వారి చేత.
భారత దేశం లో కూడా అలాంటి సంస్థ ఉంది  కానీ అది ఎలా పని చేస్తుందో  ఇప్పుడు అక్కడ ఉంటున్న వారికి తెలియాలి. ప్రత్యేకించి సర్వైకల్ క్యాన్సర్ నివారణ కు ఏ చర్యలు చేపడుతుందో,  ఈ టపా చదువుతున్న వారు ఎవరైనా తెలియ చేయవచ్చు, వారికి తెలిస్తే.
సరే ఇప్పుడు అసలు విషయం:  ఇంగ్నండు లో మాత్రం  25 నుంచి 49 ఏళ్ళ వయసు లో ఉన్న స్త్రీలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, 50 నుంచి 64 ఏళ్ళ మధ్య వయసులో ఉన్న స్త్రీలకు  ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి  ఈ స్క్రీనింగ్  పరీక్ష కు పిలవడం  జరుగుతుంది.   ఒకసారి వారు ఈ పరిక్ష ను జరిపించుకొంటే, తరువాత పరీక్షలు ఎంత త్వరగా చేయించుకోవాలి అనే విషయం మొదటి పరీక్ష లో చూసిన సర్వైకల్ కణాల మార్పు  మీద ఆధార పడుతుంది.
4.HPV టీకా  లేక HPV వాక్సిన్ :  ఇప్పటి వరకూ రెండు మందుల కంపెనీలు  ఈ HPV టీకా ను తయారు చేస్తున్నాయి.  మనం మునుపటి టపాలో తెలుసుకున్నట్టు , HPV వైరస్ లు  వంద కు పైగా ఉన్నాయి. అందు లో ముఖ్యమైన 6,11,16,18 రకాలు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ లకు కారణం. అందు వల్ల ఈ టీకాలు వేయించుకుంటే చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ HPV టీకా,  సర్వైకల్ క్యాన్సర్ రాకుండా  సంపూర్ణ రక్షణ ఇవ్వదు.
HPV టీకా ఎప్పుడు తీసుకోవాలి? : ప్రతి యువతీ, ఈ టీకాను వారు రతి క్రియ లో  ప్ర ప్రధమం గా పాల్గొన బోయే సమయానికి ముందే  వేయించుకోవాలి. ఒకసారి రతి క్రియా జీవితం మొదలు పెడితే,  ఈ టీకా పూర్తి రక్షణ ఇవ్వదు.  అంటే అలాంటి సమయాలలో ఇన్ఫెక్షన్ కనుక సంభవిస్తే, HPV టీకా పని చేయదు.
ఇంగ్లండు లో ఈ టీకా ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు ? :  12 నుంచి 13 ఏళ్ళ వయసు మధ్య ఉన్న అమ్మాయిలకు , మూడు టీకాలు, ఆరు నెలల వ్యవధి లో ఇస్తారు.
HPV టీకా తీసుకుంటే  స్మియర్ టెస్ట్  అవసరం లేదా ? : 
ముందు చెప్పు కున్నట్టు, టీకా కేవలం నాలుగు రకాల వైరస్  లకు వ్యతిరేకం గానే రక్షణ ఇచ్చి , రోగ నిరోధక శక్తి ని ఎక్కువ చేస్తుంది. క్యాన్సర్ కలిగించే ముఖ్యమైన రకాలు ఈ నాలుగే అయినప్పటికీ , మిగతా రకాలు కూడా క్యాన్సర్ కలిగించ గలవు కాబట్టి , స్మియర్ టెస్ట్  క్రమం గా అంటే  ప్రతి మూడేళ్ళకో, అయిదేళ్లకో చేయించు కోవడం ఉత్తమం.
ఈ విషయాలలో అనుమానాలు ఉంటే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది.
 వచ్చే టపా ద్వారా మళ్ళీ కలుసుకుందాం !
  1. స్మియర్ టెస్ట్ ఎప్పుడు చేయించు కోవాలి? :
    పాశ్చాత్య దేశాలలో, ఆ దేశాలకు చెందిన ప్రతి సిటిజెన్ కూ ఆరోగ్య పరం గా ఏ పరీక్షలు ఏ సమయం లో చేయించుకోవాలో ఆ దేశం యొక్క ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నిర్ణయించి తదనుగుణం గా వారికి సలహా ఇచ్చి పరీక్షలు చేయిస్తుంది వారి చేత.
    భారత దేశం లో కూడా అలాంటి సంస్థ ఉంది కానీ అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు అక్కడ ఉంటున్న వారికి తెలియాలి. ప్రత్యేకించి సర్వైకల్ క్యాన్సర్ నివారణ కు ఏ చర్యలు చేపడుతుందో, ఈ టపా చదువుతున్న వారు ఎవరైనా తెలియ చేయవచ్చు, వారికి తెలిస్తే.
    Sorry no information about the existence of such institution. No activity noticed.Every body is left to her own fate by the Government

  2. Many thanks Sharma gaaru. ‘ baagu’ aims to create such awareness.( I know my effort is a drop in the ocean. I also know many ‘ such drops’ make an ocean ) .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: