సర్వైకల్ క్యాన్సర్.
గర్భాశయ భాగమైన సర్విక్స్ లో వచ్చే క్యాన్సర్ ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు.
( సర్విక్స్ అంటే మెడ భాగం అన్న మాట. అందుకే మెడ భాగం లో ఉన్న వెన్ను పూసను సర్వైకల్ స్పైన్ అని, అక్కడ ఉన్న ఎముకలను సర్వైకల్ వెర్టేబ్రా అనీ అంటారు) .
గర్భాశయం మొదటి భాగం లో మెడ లా ఉండటం వల్ల ఈ భాగాన్ని కూడా సర్విక్స్ అని అందుకనే అంటారు.
ఈ సర్విక్స్ కు వచ్చే క్యాన్సర్ ప్రపంచం మొత్తం లో క్యాన్సర్ వల్ల స్త్రీలలో సంభవించే మరణాలలో అయిదవ ముఖ్య కారణం గా పేర్కొనబడింది, మరణాల సంఖ్యా పరంగా.
ఇండియా లో స్త్రీలలో వచ్చే క్యాన్సర్ లలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రముఖమైనది. అంటే ఇండియా లో క్యాన్సర్ వల్ల మరణించే స్త్రీలలో ఎక్కువ మంది సర్వైకల్ క్యాన్సర్ వల్లనే.
ఈ సర్వైకల్ క్యాన్సర్ రావటానికి కారణాలు ఏమిటి, సర్వైకల్ క్యాన్సర్ ను మొదటి దశలలో ఎట్లా కనుక్కోవచ్చు, చికిత్సా పద్ధతులు ఏమిటి అనే విషయాల గురించి
వచ్చే టపా నుంచి వివరం గా తెలుసుకుందాము.
( క్రితం టపా లో పొందుపరిచిన గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించిన సంపూర్ణ సమాచారం గురించి ఆంగ్లం లో ఉన్న వీడియో ను అతి తక్కువ మంది మాత్రమే చూశారు.
ఎందుకో యు ట్యూబ్ వీడియో లకు చెప్పుకోతగ్గ స్పందన ఉండటం లేదు. కారణాలు కూడా తెలియట్లేదు. అందు వల్ల రాత పూర్వకం గానే వీలైనంత సమాచారాన్ని తెలియ పరుస్తేనే మంచిదనే ఉద్దేశం కలుగుతుంది. ఈ విషయం పైన మీ అభిప్రాయాలు తెలుపగలరు )
to say without clearly, the accent is difficult to be followed. it is better u give a commentary for ur self or write the gist of it, it will be helpful. telling u the truth.
to say clearly
Many thanks for your valuable comments.
I will keep in mind, these suggestions.
Thank u