Our Health

ఋతుక్రమం – సమస్యలు.5. డిస్మెనో రియా .

In Our Health on ఏప్రిల్ 8, 2012 at 9:22 ఉద.

డిస్మెనో రియా  ‘ Dysmernorrhoea ‘  అంటే ఏమిటి:

ఋతుస్రావం  సమయం లో నొప్పి కలిగి ( సాధారణం గా క్రింద ఉదర భాగం లో ), ఆ నొప్పి భరింప రానిది అయి స్త్రీల రోజు వారీ పనులను కుంటు పరుస్తూ ఉంటే, ఆ  స్థితిని  డిస్ మెనో రియా అంటారు.
రుతుస్రావ సమయంలో నొప్పులు చాలా సాధారణం. ప్రత్యేకించి ఋతుక్రమం మొదలైన కొన్ని నెలలు , అందులో ప్రత్యేకించి యుక్త వయసులో ఉన్న యువతులలో ఈ రకమైన నొప్పులు కనీసం వంద మందికి ఇరవై అయిదు మందిలో కనబడతాయి.
డిస్ మెనో రియా లో నొప్పి ఎలా ఉంటుంది ? : 
ఈ స్థితి లో వచ్చే నొప్పి  క్రింద ఉదర భాగం లో అంటే కటి వలయ లేక పెల్విక్ ప్రాంతం లో మొదలవుతుంది.  ఇది పలు రకాలు గా స్త్రీలలో కనిపిస్తుంది.
సూదుల తో పొడిచినట్టు గానూ, మెలితిప్పినట్టు గానూ, మంట గానూ  ఈ నొప్పులను స్త్రీలు అనుభవించ వచ్చు. కొన్ని సమయాలలో ఈ నొప్పి పెల్విక్ లేక కటి వలయ ప్రాంతం నుంచి క్రింద తొడల వరకూ లేక వెనుక వీపు లేక నడుము భాగాలకు ప్రాకినట్టు ఉండవచ్చు. ( పైన ఉన్న పటం చూడండి ) ఇంకొన్ని సమయాలలో ఈ నొప్పులు తీవ్రం గా ఉండి, వికారమూ, కడుపు లో తిప్పినట్టు ఉండటమూ, వాంతులూ , కలిగించవచ్చు.
కొందరిలో ఈ డిస్ మెనో రియా ,  మామూలు సమయం లో జరుగుతున్న రక్త స్రావం కంటే ఎక్కువ రక్త స్రావం కలిగించ వచ్చు. అప్పుడు ఈ పరిస్థితిని  మెనో రేజియా అంటారు ( menorrhagia ).
సామాన్యం గా ఈ నొప్పులు ఋతుస్రావం సమయం లోనే ఉండి ఋతుస్రావం అయిపోగానే అంటే నాలుగు అయిదు రోజులకు తగ్గుతాయి. 
డిస్ మెనో రియా మిగతా లక్షణాలు ఏమిటి ? : 
పైన చెప్పిన లక్షణాలే కాక డిస్ మెనో రియా తో బాధ పడుతున్న వారిలో  తల నొప్పి, తల తిప్పినట్టు ఉండడం, ఏ పని మీదా మనసు లగ్నం చేయలేక పోవడం, విపరీతమైన అలసట గా ఉండటమూ ,  కొద్ది శబ్దాలైనా , వెలుతురు అంటే కాంతి వంతమైన ప్రదేశాలలోనూ , వీరు ఎక్కువగా స్పందించి , ఆ పరిస్థితులను తట్టుకో లేక పోవడమూ, కొన్ని సమయాలలో స్పృహ తప్పి కింద పడటమూ కూడా జరుగుతుంటాయి.
కారణాలు ఏమిటి ? :
డిస్ మెనో రియా రెండు రకాలు. మొదటి రకాన్ని ప్రాధమిక లేక ప్రైమరీ డిస్ మెనో రియా అంటారు. రెండవ రకాన్ని ద్వితీయ లేక సెకండరీ డిస్ మేనోరియా అంటారు. ప్రాధమిక డిస్ మెనో రియా లో  గర్భాశయ కండరాల సంకోచాలు అంటే కాన్త్రాక్షన్  అవుతాయి. అప్పుడు ఆ ప్రదేశం లో ప్రోస్టా గ్లాండిన్ లు అనే జీవ రసాయన పదార్ధాలు విడుదల అవుతాయి. గర్భాశయ కండరాలు విపరీతం గా సంకోచించడం వల్ల ఆ ప్రదేశం లో ప్రాణ వాయువు అంటే ఆక్సిజెన్ కూడా తగ్గుతుంది. ఈ కారణాలన్నీ కలిసి ,కండరాల నొప్పులు గా పరిణ మించుతాయి. ఈ నొప్పులనే క్రామ్ప్స్ అని కూడా అంటారు.
ప్రాదమిక లేక ప్రైమరీ డిస్ మెనో రియా కు ఏ కారణమూ కనపడదు. కానీ ద్వితీయ లేక సెకండరీ డిస్ మెనో రియా కు కారణాలు ఉంటాయి. అదే ఆ రెండు రకాలకూ ఉన్న తేడా ! 
వచ్చే టపాలో డిస్ మెనో రియా కు చేయ వలసిన పరీక్షలూ, చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకుందాము !
  1. అభ్యర్ధన :

    నమస్తే!
    ‘ సేవ’ సంస్థ ఆధ్వర్యంలో ‘సకల’ అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
    అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే… sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
    మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

    వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ…

    సదా సేవలో,
    -కంచర్ల సుబ్బానాయుడు,
    సంపాదకులు, సేవ
    http://sevalive.com/

  2. మీరు వర్డ్ ప్రెస్ టెంప్లేట్ ని మారచండి. కుడి వైపున అన్నిటపాలను నెల వారిగా చూపే మరేదైనా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొంటే బాగుంట్టుంది. పాత టపాలు చదవాలంటె చాలా కష్ట్టం గా ఉంది. బ్రౌస్ చేయటానికే ఎక్కువ సమయం అయిపోతున్నాది.

    చిన్న ప్రశ్న మీరు ఈ నొప్పులు గురించి రాస్తున్నరు కదా!నేటి తరం వారు పగలు రాత్రి కష్ట్ట పడుతున్నారు వారు ఈ నొప్పులను ఎలా భరిస్తున్నారు?

    • మీ సలహా కు కృతఙ్ఞతలు. వీలైనంత త్వరలో అన్ని టపాలూ త్వర గా బ్రౌజ్ చేయగలిగే ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తాను. నాకూ ఈ బ్లాగు ప్రపంచం కొత్త ! ఇది నా మొదటి ప్రయత్నం. కొన్ని సమయాలలో మనం వాడుతున్న కంప్యుటర్ స్పీడు బట్టి కూడా బ్రౌజ్ చేయ దలుచుకున్న టపా ల స్పీడు మారుతూ ఉంటుందనుకుంటాను.
      మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ తరం యువతులు, స్త్రీలు, పగలు, రాత్రి, ఇంటా, బయటా కష్ట పడుతున్నారు. ఋతుస్రావం లో నొప్పులు రావటం సహజం. ఈ నొప్పులకు కారణం కూడా డిస్ మేనోరియా టపాలలో వివరించడం జరిగింది.
      ఈ సహజమైన నొప్పులు, నొప్పులైనప్పటికీ , వారు భరించ గలిగే తీవ్రత తో ఉంటాయి. ఋతు స్రావం దశ అయిపోయాక, హార్మోనులు, వాటి ప్రభావం తగ్గాక, నొప్పుల తీవ్రత కూడా తగ్గుతుంది.
      మనం తెలుసుకున్నట్టుగా , ఈ సహజమైన నొప్పులు తీవ్రంగా భరింప లేనివిగా పరిణమించి , స్త్రీలు రోజు వారీ పనులు కుంటు పడుతుంటే, అప్పుడు, వారు గైనకాలజిస్ట్ ను సంప్రదించి తగు సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
      అలాంటి పరిస్థితి సాధారణం అయినా, అందరిలోనూ ఆ పరిస్థితి రాదు కదా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: