ఋతుక్రమం – సమస్యలు.1.
సహజ ఋతుక్రమం . ( normal menstrual cycle ) :
ఋతుక్రమం లేక మెన్ స్ట్రువాల్ సైకిల్ అనే పదం, గర్భధారణ సామర్ధ్యం కల స్త్రీల శరీరం లో జరిగే మార్పులను తెలిపే శాస్త్రీయ పదం. ఋతుక్రమం అని ఎందుకు పిలవబడుతుందంటే , ఈ మార్పులు స్త్రీ లలో సహజంగా, ప్రతి నెలా క్రమంగా వస్తాయి కాబట్టి.
సాధారణం గా ఋతుక్రమం ఇరవై ఎనిమిది రోజుల తరువాత మళ్ళీ మొదలవుతుంది. ఈ ఇరవై ఎనిమిది రోజులలో జరిగే వివిధ మార్పులను మనం కొన్ని దశలుగా గమనించవచ్చు.
ఈ మార్పులు స్త్రీలలోని అండాశయం లోనూ ఇంకా గర్భాశయం లోనూ జరుగుతుంటాయి.
అండాశయాలు రెండు, గర్భాశాయానికి రెండు వైపులా ఉంటాయి. అండాశయం లో జరిగే మార్పులను మూడు దశలలో మనం తెలుసుకోవచ్చు.
ఒకటి ఫాలిక్యులర్ దశ రెండవది ఒవ్యులేషన్ , మూడవది ల్యుటియాల్ దశ. అలాగే గర్భాశయం లో జరిగే మార్పులను మూడు దశలలో ఉంటాయి. ఒకటి మెన్సెస్, రెండవది ప్రాలిఫరేటివ్ దశ , మూడవది సేక్రీటరీ దశ.
మనం ఋతుక్రమం సాధారణ సమయం ఇరవై ఎనిమిది రోజులు అని అనుకున్నట్లయితే మొదటి రోజు నుంచి నాలుగవ రోజు వరకు మెన్సెస్ అని చెప్పుకోవచ్చు . అంటే రమారమి ఈ నాలుగు రోజులూ ఋతుస్రావం లేక మెన్ స్ట్రువాల్ బ్లీడింగ్ అవుతుంది.
అండాశయం లో జరిగే మార్పులూ , గర్భాశయం లో జరిగే మార్పులూ అనేక రకాలైన హార్మోనుల పర్యవేక్షణ లో జరుగుతాయి. మనం క్రితం టపా లలో చూశాము హార్మోనులు అంటే ఏమిటో.( మన దేహంలో ఉండే, నిరంతరం తయారవుతూ ఉండే , జీవ రసాయన పదార్ధాలు. ఈ ప్రత్యేకమైన జీవ రసాయన పదార్దాలు, కొన్ని కొన్ని ప్రత్యేకమైన జీవ క్రియలను మన దేహం లో నియంత్రించి పర్యవేక్షిస్తూ కూడా ఉంటాయి. ) వీటి గురించి కూడా తెలుసుకుంటే బర్తు కంట్రోలు కు అవసరమయే బిళ్ళలు ఎలా పని చేస్తాయో కూడా అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రింది పటం స్థూలం గా ఋతుక్రమం లో జరిగే మార్పులను తెలుపుతుంది.
( యు ట్యూబ్ అందుబాటు లో లేని వారు ఈ పటం లో ఆ మార్పులు గమనించ వచ్చు )

వచ్చే టపాలో ఋతుక్రమం లో వివిధ దశలలో జరిగే వివిధ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాము.
సహజ ఋతు క్రమంలో ఏమి జరుగుతుందో క్లుప్తంగా వివరించిన ఈ అత్భుతమైన యు ట్యూబ్ వీడియో చూడండి:
ఆర్టికల్స్ అనీ మరో టపాకోసం ఎదురుచూసేవిదంగా..వివరణాత్మకంగా వున్నాయి…
Thanks.
ఇలాంటి చాల విషయాలు తెలియని వారు చాలామందే ఉన్నారు. ఇలాంటివి మరిన్ని రాస్తారని ఆశీస్తూ.
——KKR
కృతఙ్ఞతలు KKR గారూ!
సమయానుకూలం గా మరిన్ని టపాలు వేస్తాను. మీ బంధుమితృలకు తెలియచేయండి , వైద్య విషయాల పై అవగాహన కోసం !