కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 11.
‘ లవ్ హార్మోన్ ‘ అంటే ఏమిటి?:
ఆక్సీ టోసిన్ ( oxytocin ) ను ‘ లవ్ హార్మోన్ ‘ లేక ‘ ప్రేమ హార్మోన్’ అంటారు. ఆక్సీ టోసిన్ కూడా ఒక హార్మోనే ! ఇది స్త్రీలలో అనేక రకాల జీవ రసాయన చర్యలకు కారణం. ఇటీవల జరిపిన పరిశోధనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి ఆక్సీ టోసిన్ గురించి. ఆక్సీ టోసిన్ స్త్రీల ప్రత్యుత్పత్తి సమయం లో విడుదల అవుతుంది. స్త్రీలు గర్భ ధారణ సమయం లోనూ, తరువాత శిశువు జన్మించే సమయంలోనూ అనేకమైన కీలకమైన క్రియలు నిర్వర్తిస్తూంది. తరువాత , మానవ శరీరం లో అనేక హావ భావాలకూ ఎమోషన్లకూ, అంటే అనుభూతులకు కూడా ఈ ఆక్సీ టోసిన్ కారణ భూతమని విశదపడ్డది. ఆకర్షణ,ప్రేమ, ఆప్యాయత, ఆనందం, వత్తిడి తరువాత కలిగే విముఖత – ఈ అనుభూతులన్నిటిలోనూ, ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ఆక్సీ టోసిన్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిసింది. పురుషులలో ఆక్సీ టోసిన్ : ఇటీవల జరిపిన పరిశోధనలలో పురుషులలో కూడా ఆక్సీటోసిన్ తన ప్రభావం చూపి వీర్య స్ఖలనం జరిగే చర్యకు కారణ భూతమవుతుందని తెలిసింది. మనం ఇంతకు ముందు టపాలలో చూశాము, కామోత్తేజం కలిగినప్పుడు ఆక్సీ టోసిన్ స్థనం నుంచి విడుదల అవుతుందని.అలాగే ఆక్సీ టోసిన్ తల్లి, పాలు తాగించేప్పుడు కూడా చనుబాలు ఎక్కువ స్రవించ డానికి కూడా ఆక్సీ టోసిన్ మహిమే ! కొందరు స్త్రీలలో కనిపించే అతి దుడుకు స్వభావము, కపటత్వము, సానుభూతి చూపలేక పోవడము, అసాంఘిక ప్రవర్తన, ఈ స్వభావాలన్నిటికీ వారిలో ఆక్సీ టోసిన్ సరిగా స్రవించక పోవడం కారణమని భావించడం జరుగుతుంది. మెదడులో ఆక్సీ టోసిన్ ప్రభావం: వివిధ పరిశోధనల ద్వారా ఆక్సీ టోసిన్, కామోత్తేజం కలిగించి, తద్వారా కామోచ్చ అంటే ఆర్గాసం కూ , పేర్ బాండింగ్ లేక పురుషునితో జంటగా చేరడం లో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే, రొమాంటిక్ అటాచ్మెంట్ ప్రవర్తనకు , మాతృ భావనలకూ ఆక్సీ టోసినే కారణం. ఇంకా ఆక్సీ టోసిన్, గర్భాశయ కండరాలు గట్టిగా అంటే కాంట్రాక్ట్ అవటానికీ, గర్భ ద్వారం అంటే సర్విక్స్ ( శిశు జనన సమయం లో ) కండరాలు రిలాక్స్ అవటానికీ తోడ్పడుతుంది. గాయం మానటానికి కూడా ఆక్సీ టోసిన్ ఉపయోగ పడుతుందని తెలిసింది. సాంఘిక ప్రవర్తన లో కూడా ఆక్సీ టోసిన్ పాత్ర ఉందని తెలిసింది ఇతర వ్యక్తుల తో ప్రవర్తించే సమయం లో బిడియం తగ్గి, నమ్మకం పెంచుకునే దిశలో ఆక్సీ టోసిన్ సహాయ పడుతుందనీ, అలాగే బెట్టింగ్ అంటే పందాలు కాసే సమయం లో ఆక్సీ టోసిన్ risk taking behaviour అంటే రిస్కు తీసుకునే స్వభావాన్ని తగ్గిస్తుందనీ తెలిసింది.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము !