చరిత్రలో రెండు ఒకే రకమైన సంఘటనలు కొద్ది రోజుల వ్యవధి లో రెండు దేశాలలో జరగటం కేవలం యాదృచ్చికం. అయితే తరువాతి పరిణామాలు మాత్రం కాదు.
అదే జరిగింది ఇటీవల ఫుట్ బాల్ మైదానాల మీద. ఒకటి ఇండియా లోని బెంగుళూరు లో. ఇంకోటి ఇంగ్లాండు లోని లండన్ లో !! తేడాలు గమనించండి ( ఫోటోలలో కూడా ! )
శ్రద్ధగా చదవండి, ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి.
పేరు : వెంకటేష్
వయసు : 27 సంవత్సరాలు.
ఆట : ఫుట్ బాల్
స్థానం : స్ట్రయికర్
క్లబ్: బెంగుళూరు మార్స్
ఆడిన తేదీ: 21.03.12.
జరిగిన సంఘటన: రైల్వే టీం తో ఆడుతున్న ఆట లో లేట్ సబ్సిస్త్యూట్ గా వచ్చాడు వెంకటేష్. కొద్ది సేపటికే ఆకస్మికంగా పడిపోయాడు ఆట స్థలం లో.ఫస్ట్ ఎయిడ్ టీం అక్కడ లేదు,
మిగతా ఆటగాళ్ళు వెంకటేష్ దగ్గరకు వచ్చారు. వెంకటేష్ కదలలేదు , మెదలలేదు. స్ట్రెచర్ కోసం వెదికారు, శిధిలావస్థలో ఉంది అది. అందరూ కలిసి మోసుకు వెళ్ళారు గ్రౌండ్ బయటకు. బయట అంబులెన్స్ లేదు. ఒక ఆటో లో ఇరికించారు తీవ్ర అస్వస్తుడైన వెంకటేష్ ను. ఆసుపత్రికి చేర్చారు. డాక్టర్లు అప్పటికే మరణించాడని ద్రువించి , చెప్పే మాట వినడం కోసం !!
ఇంకో ఫుట్ బాల్ ఆటగాడు.
స్థానం : మిడ్ ఫీల్డర్
పేరు: ఫాబ్రిస్ మువాంబా
వయసు : 23 సంవత్సరాలు.
క్లబ్: బోల్టన్ ప్రిమియర్ లీగ్ ఫుట్ బాల్ క్లబ్.
ఎక్కడ జరుగుతుంది: లండన్ లో
ఆడిన తేదీ : 17.03.12.
జరిగిన సంఘటన: టోటెన్ హాం టీం తో ఆడుతున్న మువాంబా ఆకస్మికంగా కూలిపోయాడు ఆట స్థలం లో.
వెంటనే పారా మేడిక్స్ అంటే ప్రధమ చికిత్స లో సుశిక్షుతులైన సిబ్బంది నిమిషాలలో చేరారు అక్కడకు స్ట్రెచర్ తో సహా.
ఆటస్థలం లోనే రిసస్సిటేట్ చేసారు 48 నిమిషాల సేపు. ఫలితం : శూన్యం : మువాంబా కదలలేదు మెదలలేదు. ఆ సిబ్భంది అంటే పారామేడిక్స్ వారు చేస్తున్న విధి ఆపలేదు.
ఫాబ్రిస్ మువాంబా ను దగ్గరలోని లండన్ హాస్పిటల్ కు చేర్చారు. అక్కడ మువాంబాను బ్రతికించే క్రియ ఉధృతం అయింది. పదిహేను సార్లు కరెంటు షాక్ ఇవ్వడం జరిగింది. అంటే డీ ఫిబ్రిలేటార్ ( defibrillator ) అంటారు వైద్య పరి భాషలో.
ఫలితం : ఫాబ్రిస్ మువాంబా నిజంగా రెండు గంటలు చచ్చి, తరువాత బ్రతికాడు !. అవును మువాంబా నిజంగా మరణించి బ్రతికాడు !!
మువాంబా ఇండియా లో ఆడుతున్నప్పుడు అదే సంఘటన జరిగి ఉంటే ??!!!
( ఏమి జరిగేదో మీ ఊహకు వదిలేయడం మంచిదనుకుంటున్నాను )
( ఇక్కడ చదువరులు ఒక విషయం గమనించాలి. మానవులకు ఏ ఆకస్మిక ప్రమాదం అయినా జరిగినప్పుడు, జరిగిన వెంటనే ఉన్న అరవై నిమిషాలను ‘ బంగారు గంట ‘ లేక వైద్య పరిభాష లో GOLDEN HOUR అంటారు. అంటే ప్రమాదం లో తీవ్రంగా రక్త స్రావం అవటం గానీ, హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు కానీ, లేక పక్షవాతం వచ్చినవెంటనే కానీ, ఈ అరవై నిమిషాలలో జరిగే వైద్య సహాయం ఎంతో కీలకమైనది. ఆ సమయం లో చేపట్టే ప్రధమ చికిత్స చర్యలు మరణాల సంఖ్యను ఎంతగానో తగ్గిస్తాయని ప్రపంచం లో వివిధ దేశాలలో జరిగిన పరిశోధనలు ఖచ్చితంగా తెలుపుతున్నాయి. భారత దేశం కర్మ భూమి. ఏమి జరిగినా చేసిన కర్మల వలెనే అనుకునే స్వభావం. కానీ గీతా సారం కూడా ‘ మన విధి సక్రమం గా నిర్వర్తించమని, ఫలితం దేవుడిమీద వదిలేయమని ! ఇలా అన్ని పరిస్థితులలో జరుగుతుందా అని ఆత్మ శోధన చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితులకు కారకులైన వారు, ( ఎవరో కూడా చదువరులకు తెలుసు కదా ! )
.