కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.9.
ముందాట:
మనసును తాకే ముందాట గురించి మనం కొంత తెలుసుకున్నాము.
మాట్లాడకుండా హావ భావాలతో మన ఇష్టా ఇష్టాలను తెలుపటం కూడా ముందాట లో చేస్తుంటారు, చాలా మంది.
అంటే తదేకంగా రెప్పలార్పకుండా ఆమె వైపు చూడడం, కన్ను కొట్ట్టటం, పెదవులు సున్నితంగా పంటి మధ్య నొక్కుకోవడం, ( నాగ భూషణం గారి లానో, రావు గోపాల రావు గారిలానో కాదండీ ! ) వ్యక్తిగత స్థలం లో దూసుకు పోవటం ( అంటే పర్సనల్ స్పేస్ : ప్రతి వ్యక్తికీ ఈ పర్సనల్ స్పేస్ లేక వ్యక్తిగత స్థలం ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడినా, ఈ స్థలాన్ని అతిక్రమించకూడదు, ఈ పట్టింపు పాశ్చాత్య దేశాలలో ఎక్కువ గా ఉంటుంది. భారత దేశం లో కారణాంతరాల వల్ల ఈ వ్యక్తిగత స్థలాన్ని చాలా మంది ( కావాలని కొంతమంది ) అతిక్రమిస్తూంటారు. ఉదాహరణకు, సిటీ బస్సు లో ప్రయాణించేటప్పుడు, సినిమా టాకీస్ వద్ద, ఇంకా బహిరంగ ప్రదేశాలలో!). కానీ ఇష్ట పడే వారుంటే, వారి స్థలాన్ని అతిక్రమించినా నొచ్చుకోరు.
ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం, సరియిన స్థలాలలో అసలు ధరించకపోవడం కూడా కామోత్తేజాన్ని కలిగించే ముందాట అవుతుంది.
ముందాట ముందు జాగ్రత్తలు:
ప్రియురాలి తో సంభాషణలో ప్రియుడు ఎక్కువ సమయం తన ఇతర స్నేహితుల గురించో లేక తనకు తెలిసిన ఇతర అమ్మాయిల గురించో మాట్లాడుతూ ఉండటం, అపరిశుభ్రం గా ఉండి, నోటినుంచి ఉల్లిపాయలో , వేల్లుల్లో, తిన్నప్పుడు వాసన , సిగరెట్ తాగిన వాసన ( చాలా మంది యువతులు సిగరెట్ వాసన ఇష్టపడరు ), మద్యం సేవించిన తరువాత ( సామాన్యంగా ఏ రకమైన మద్యం తాగినా , తరువాత కనీసం ఎనిమిది గంటల వరకూ మన శ్వాస లో ఆ వాసన వస్తూంటుంది) లేక ఇతర భరించలేని వాసనలు రావడం, ఎక్కువ స్వేదం పట్టడం, ఇలాంటివి ముందాట మొదలు కాకుండానే ప్రియుడిని ఓడించుతాయి. అలాగే విపరీతంగా కామోత్తేజ పరంగా బిడియం గా ఉండటం, చొరవ చూపించకపోవటం కూడా ముందాట కు అవరోధాలావుతాయి.
ముందాటలు ఎలా ఉండ వచ్చు? : ఎలాగైనా ఉండవచ్చు. ఫలితం ప్రేయసీ ప్రియులు బిడియం మాని సన్నిహితం, ప్రేమానుభంధం ఎక్కువ అవాలి.
ఈ ఇంటర్నెట్ యుగం లో మెసేజెస్ పంపుకోవడం మొబైల్ ఫోనులమీదో లేక ఈ మెయిల్స్ ద్వారానో. అలాగే చిన్న చిన్న ఆటలు ఆడి గేలిచిన వారు ఓడిపోయిన వారిచేత బట్టలు తీసేయడమో, లేక ఫుట్ మసాజ్ చేయించు కోవడమో , లేక ముద్దు పెట్టించు కోవడమో , ఇలాంటి పందాలు పెట్టుకుంటే ,ఆత్మీయత పెరిగి కామూత్తేజం పొందుతారు ప్రేయసీ ప్రియులు. సెక్స్ వీడియోలు, సినిమాలూ ప్రేయసీ ప్రియులు కలిసిచూడటం కూడా ముందాట లో భాగం చేసుకోవచ్చు.
తాంత్రిక ముందాట : ఈ రకమైన ముందాట లో ప్రేయసీ ప్రియులు రతి క్రియ కోసం తహ తహ లాడకుండా మొదట మనో సంగమం చెందటం మీద లగ్నం చేసేట్టు చేస్తుంది.
ఈ ఆటలో ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు సుగంధ తైలాల తో మాసాజ్ చేసుకోవడము, జలకాలాడడమూ, గోరంత దీపాలలో అంటే క్రొవ్వొత్తి వెలుగులలో కామోత్తేజం చెందడమూ కూడా ఉంటాయి. ఈ తాంత్రిక ముందాట, ముందు ముందు భారత దేశం లో ప్రతి మసాజ్ పార్లర్ లోనూ, ప్రతి స్టార్ హోటల్ లోనూ ప్రవేశ పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు !
నిత్య జీవితం లో ముందాట ఉపయోగం ఏమైనా ఉందా ?:
ముందాట, ప్రేయసీ ప్రియులను, వారు దంపతులైనా కూడా, వారి ఇంటిమసీ అంటే సన్నిహితం ఎక్కువ చేసి అనుబంధాన్ని ప్రేమ బంధం గా బల పరుస్తుంది. కామోత్తేజం కూడా ఎక్కువ చేసి వారిని కామోద్రేకులను కూడా చేసి, రతి క్రియ లో అత్యంత ఆనందం పొందేట్లు చేస్తుంది.
కానీ ఒక యూరోపియన్ సర్వే, ప్రాగ్ నగరం లో జరిగింది, రెండు వేల మూడు వందల మంది స్త్రీల కామ పరమైన అంటే సెక్స్ అలవాట్ల మీద. దాని ఫలితం ఏమిటంటే : ముందాట ప్రతి రతి లో కంపల్సరీ కాదు. అంటే తప్పనిసరి గా ముందాట రతిక్రియ కు ముందు ఉండనవసరము లేదు. ముఖ్యమైన విషయం రతి క్రియా సమయం. అంటే రతిక్రియ మొదలు నుంచి ప్రేయసీ ప్రియులు ఆర్గాసం పొందేంత వరకూ. ఈ సమయం రమారమి పదహారు నిమిషాలు ఉంటే, స్త్రీలు ఎక్కువ సంతృప్తి చెందుతారు కామ పరంగా అంటే సెక్స్ పరంగా అని తెలిసింది.
అంటే పదహారు నిమిషాల రతిక్రియ ఎంతో కీలకమైనది ప్రతి జంట కూ ! ప్రత్యేకించి స్త్రీకి !
ముందాట ను ప్రేయసీ ప్రియులు ఎంత రమణీయం గా తెలిపారో ఈ పాటలో చూడండి.( పూర్తిగా ఆస్వాదించాలంటే, వీలు చేసుకుని వినండి, చూడండి ఇంటర్నెట్ లో ),
అదే, అదే, అదే వింత నాకు అంతు తెలియకున్నదీ,
ఏదో లాగు మనసు లాగుతున్నదీ అని ఆమె
అదే వింత నేను తెలుసుకున్నదీ ,
అదే నీ వయసు లోన ఉన్నదీ అని అతడు
నీ నడకలోన రాజ హంస అడుగులున్నవీ ,
నీ నవ్వు లోన సన్న జాజి పువ్వులున్నవీ అని అతడు ఆమె అందాన్ని వర్ణిస్తే,
ఏమేమి ఉన్నవీ , ఇంకేమి ఉన్నవీ ,
‘ ఈవేళ నా పెదవులేల వణుకుతున్నవీ ‘ అని ఆమె తన దేహం లో కామోత్తేజం తో జరుగుతున్న మార్పులను, అమాయకంగా ప్రియునికి తెలుపుతుంది ! ప్రశ్నిస్తుంది.
నీ చేయి సోకగానె ఏదో హాయి రగిలెనూ,
ఓయీ అని పిలవాలని ఊహ కలిగేనూ అని ఆమె ( ఇక్కడ మనం వ్యాసం లో ముందు చూసినట్లు, ప్రేయసి ప్రియని చేయి తగలగానే హాయి కలిగిందని అంటే అది కామోత్తేజ స్థానం అనీ, ప్రియుణ్ణి, ఓయీ అని పిలవాలని ఇంటిమసీ ఎక్కువ చేసుకునే ఉద్దేశం తెలుపుతుంది )
ఏమేమి ఆయెను, ఇంకేమి ఆయెను,
ఈవేళ లేత బుగ్గలెంత కందిపోయెను ? అని అతడు ప్రియురాలిలో జరుగుతున్న మార్పులను, గమనించి, చిలిపి గా టీజ్ చేస్తూ అడుగుతున్నాడు, ఏమీ తెలియనట్టు !! ( తను తెలుసుకున్న వింత అదే ననీ , అది ప్రియురాలి వయసు లో ఉన్నదనీ ముందే చెప్పాడు కదా ! )
పాట చివరకు ఆమె కూడా’ అదే వింత నేను తెలుసుకున్నది’ అని ముగిస్తుంది !
( చిత్రం: రాముడు – భీముడు, రచన : Dr.C.నారాయణ రెడ్డి, పాడిన వారు ఘంటసాల, సుశీల, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు )
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము.
( మీ అభిప్రాయాలు తెలియ చేయండి )