కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.
ప్రత్యేక మైన కామోత్తేజ స్థానాలు:
కటి వలయ ప్రాంతము అంటే ప్యూ బిక్ ఏరియా: ఈ ప్రాంతం లో జననాంగాలు ఉంటాయి.
పురుషులలో :
జననాంగము అనేక నాడీ కణ జాలం తో, పరిణామ పరంగా ప్రత్యేకం గా ప్రత్యుత్పత్తి కి అనుగుణం గా నిర్మితమైనది.
పురుషుల జననాంగాన్ని ఆంగ్లం లో పెనిస్ అంటారు. పెనిస్ చివర భాగాన్ని గ్లాన్స్ పెనిస్ అంటారు.పెనిస్ క్రింద వైపు భాగం అంతా అనేక నాడీ తంత్రుల తో ఉండి ఎక్కువ కామోత్తేజం కలిగిస్తుంది.
ముఖ్యం గా పెనిస్, గ్లాన్స్ పెనిస్ ( అంటే జననాంగము చివరి భాగం ) తో కలిసే స్థానంలో నాడీ కణాల సంఖ్య అధికంగా ఉండి, అత్యధిక కామోత్తేజం కలిగిస్తుంది. అట్లాగే పెనిస్ పై భాగం కూడా ఎక్కువ నాడీ కణజాలం తో నిర్మితమై ఉన్నది. పెనిస్ కూ గ్లాన్స్ పెనిస్ కూ మధ్య ఉండే చర్మము కూడా అతి సున్నితమైన నాడీ కణజాలం తో నిర్మితమై, స్పర్శ కు త్వరగా కామోత్తేజం చెందుతుంది.
స్త్రీలలో :
స్త్రీ జననాంగము కూడా ప్రత్యేకమైన కామోత్తేజ స్థానం.
క్లిటోరిస్ అంటే ‘ యోని కీల’ : క్లిటోరిస్ స్త్రీ జననాంగం లో అత్యంత కామోత్తేజ స్థానం. ఈ స్థానం జననాంగము పై భాగం లో ఉంటుంది. ఈ స్థానం లో అనేకమైన నాడీ తంత్రుల చివరలు లేక మొనలు ఉండి ఏమాత్రము స్పర్శ తగిలినా అత్యంత కామోత్తేజం, కామోద్రేకము కలిగిస్తాయి.
‘A’ స్పాట్, ‘ G ‘ స్పాట్, ‘ U ‘ స్పాట్ అంటే ఏమిటి? ( పైన ఉన్న పటం చూడండి )
యోని అంటే వాజినా ద్వారము లోపల ఉండే చర్మము .దీనినే ‘ A ‘ స్పాట్ అంటారు. ఎందుకంటే యాన్టీరియర్ ఫార్నిక్స్ లో ఈ స్థానం ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా ఎక్కువ కామోత్తేజకర నాడీ తంత్రులు ఉంటాయి.
యోని ద్వారం అంటే వాజినల్ కెనాల్ ముందరి భాగంలో ఒక స్థానం. దీనిని గ్రాఫెంబర్గ్ స్పాట్ లేక ‘ G ‘ స్పాట్ అంటారు. ఈ స్థానం కామోత్తేజం లేనప్పుడు కొద్దిగా మందంగా మన నోటి అంగిలి అంటే పాలెట్ ను నాలుక తో ముట్టుకుంటే ఎలాంటి అనుభూతి ఉంటుందో అలా ఉంటుంది. కానీ స్త్రీలు కామోత్తేజం పొందినప్పుడు , ఈ స్థానం స్పాంజ్ లా మెత్తగా అవుతుంది.
‘ U ‘ స్పాట్, క్లిటోరిస్ ముందు భాగం లో మూత్ర ద్వారం ఇరు ప్రక్కలా ఉండే చర్మము. ఇది కూడా అతి సున్నితంగా నాడీ కణాలతో ఉంటుంది.
యోని లో మిగతా భాగాలు కూడా ఎక్కువ నాడీ సాంద్రత కలిగి కామోత్తేజం కలిగిస్తాయి.
ఇంకొన్ని విషయాలు వచ్చే టపా లో తెలుసుకుందాము.
Good.Educative