Our Health

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.4.

In Our Health on మార్చి 17, 2012 at 11:21 ఉద.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.4.

కామోత్తేజ, లేక కామోద్దీపనా స్థానాలు. అంటే ‘ erogenous zones ‘ :
క్రితం టపా లో చెప్పినట్లు మానవ శరీరమంతా కామోత్తేజ స్థానాలే !  
ఉదాహరణకు ఎక్కువ గా  ప్రియురాలి  అందమైన కనుబొమలు, కను రెప్పలూ , కేశాలూ,   ముఖం ప్రక్క భాగం అంటే చెవుల ముందరి నుంచి కను సన్నల మధ్య ఉన్న స్థానం , భుజాలూ, ముంజేతులు, చేతులు వీటిని  సున్నితంగా,   ప్రియుడు తన  వేళ్ళతో తాకి  ఒక దిశలో పోనిస్తే కానీ  తీవ్రమైన కామోత్తేజం కలుగుతుంది. అట్లాగే ఆమె ఉదర భాగం అంటే నడుము రొమ్ము ల మధ్య భాగాన్ని అతడు సున్నితం గా తాకి ఒక చివర నుంచి ఇంకో చివరకు పోనిస్తే కానీ, లేక ఆ ప్రదేశాన్ని చుంబిస్తే  అంటే ముద్దు పెడితే కానీ ఎక్కువ కామోత్తేజం కలుగుతుంది. అలాగే ప్రత్యేకించి ఉదర భాగం లో ఉన్న బొడ్డు అంటే ‘ navel ‘ ఉన్న స్థానం కూడా ఎంతో సున్నితమైనది కామోత్తేజానికి ! 
ఈ వాస్తవాన్ని తెలుగు సినిమా దర్శకులు ఎంతగానో  ‘ సొమ్ము’  చేసుకున్నారు, చేసుకుంటున్నారు కదా !!
ఈ కామోత్తేజ స్థానాలు ఎక్కువగా ఉత్తేజ పూరితం అవటానికి  ఈ స్థానాల చివరల ఉండే నాడీ తంత్రులు కారణం. నాడీ తంత్రుల చివరలు అతి సున్నితమైన కుంచెల రూపంలో మన బాహ్య శరీరమంతా విస్తరించి ఉంటాయి. కానీ కొన్ని స్థానాలలో ఈ నాడీ తంత్రుల మొనలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇందువల్ల , ఈ ప్రదేశాలలో తాకినప్పుడు కానీ , చుంబించి  నప్పుడు అంటే ముద్దాడి నప్పుడు కానీ ఆ స్థానాలు తీవ్రంగా ఉత్తేజం పొంది,
తద్వారా  మెదడు కు సంజ్ఞలు అంటే ‘ neuronal signals ‘ పంపి, మనను సంపూర్ణంగా ఉత్తేజం చేస్తాయి.
పైన చెప్పిన ఈ కారణం వల్ల ఈ కామోద్దీపనా స్థానాలు, లేక కామోత్తేజ స్థానాలు, రెండు రకాలుగా అంటే, సాధారణ కామోత్తేజ స్థానాలు, ప్రత్యేక కామోత్తేజ స్థానాలు గా పరిగణింప బడతాయి.
సాధారణ కామోత్తేజ స్థానాలు :  ఈ స్థానాలు,మెడ వెనక స్థానము,  మెడ ప్రక్క స్థానం,  ముంజేతుల లోపలి స్థానాలూ, రొమ్ము ప్రక్క స్థానాలు. ఈ స్థానాలు చర్మం మీద ఉండే  సాధారణ సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్య లో నాడీ కొనలు లేక చివరలు ఉండి ఎక్కువ ఉత్తేజం కలిగిస్తాయి, రతిక్రియకు ప్రేరేపిస్తాయి.
ఇక రెండవ రకం: ప్రత్యేకమైన కామోత్తేజ స్థానాలు:
ఇవి స్త్రీ పురుషుల జననేంద్రియాలు.
వీటి వివరాలు వచ్చే టపా లో చూద్దాము

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: