Our Health

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.3.

In Our Health on మార్చి 16, 2012 at 8:46 సా.

కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.3.

మాస్టర్స్ అండ్  జాన్సన్ ప్రతిపాదించిన కామ ప్రతిక్రియా వలయం కన్నా యదార్ధానికి మానవులలో  కామ ప్రతిక్రియ ఇంకా జటిలమైనదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేసాయి. ఈ వలయం, వారు  ప్రతిపాదించి నంత  ఖచ్చితం గా ఉండక సమయ సందర్భాలను, స్త్రీ పురుష ప్రేరేపిత శరీర భాగాలను  బట్టి మారుతుంటుంది.
ఉదాహరణకు  రతిక్రియ లో పాల్గొనాలనే కామ వాంఛ అంటే ‘  డిజైర్’   రతి క్రియ కు ముందు ఉండక పోవచ్చు. కామ వాంఛ,   రతిక్రియానుభూతులు  మొదలైనప్పుడు ప్రేరేపితం కావచ్చు.
అట్లాగే   కామ వాంఛ, కామోద్రేకము ఒకదాని మీద ఒకటి  ‘ overlap ‘ ఆవ వచ్చు. అంటే కామ వాంఛ  పెరుగుతున్న కొద్దీ కామోద్రేకము కూడా ఎక్కువ అవుతుంటుంది.
అనేక మైన జీవ సంబంధమైన, మానసిక  పరిస్థితులు, కామ ప్రేరణ కలిగిస్తాయి.అంటే  స్త్రీ లోనూ పురుషుని లోనూ రతిక్రియకు అంటే రెండో దశ కు తీసుకు వెళతాయి. ఈ పరిస్థితులు మన మెదడు లో  ఫ్రాన్ టాల్ లోబ్స్  లో   మనం  రతిక్రియ మీద మనకు ఆ సమయం లో ఉన్న అనుభూతులనూ , రతిక్రియలో పాల్గొనాలనే నిర్ణయాన్నీ ప్రభావితం చేస్తాయి.
ఈ జీవ, మానసిక  సంబంధమైన పరిస్థితులు, అంటే biological and psychological factors  అనేక రకాలు గా ఉండవచ్చు.
 పరిసర వాతావరణం కూడా  రతిక్రియకు ప్రేరేపించ వచ్చు.
స్త్రీ కొన్ని లక్షణాలను పురుషునిలో ముందే గమనించి వాటివల్ల ప్రభావితం అయి ఉండ వచ్చు. అలాగే పురుషుడు కూడా స్త్రీలో కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల ఆకర్షింప బడవచ్చు.
అవి భౌతిక లక్షణాలే కావచ్చు వారు ధరించే దుస్తులే కావచ్చు.వారి  కేశాలంకరణ కావచ్చు , లేక ‘ వారి మనసే’  కావచ్చు
సుగంధమయ ప్రదేశము, అందమైన పరిసరాలూ,  అలాగే  ప్రణయ వాతావరణము: అంటే సమ ఉష్ణోగ్రతా,  ప్రశాంత సమయము, లేక నచ్చిన సంగీతము ఇలాంటివి.
ముందు మాట, కామోత్తేజ స్థానాలు, ముందాట ( fore play ) : 
రతిక్రియ ను ప్రేరేపించటానికి ముందు ప్రేయసీ ప్రియుల మధ్య  ఆనంద కరమైన ప్రణయ సంభాషణ ఎంతో విలువైనది. వారి మధ్య బాసలు, ఊసులు , ఇద్దరినీ రతిక్రియ కు మనసులో ఉత్కంథత రేపి వారిని సమాయత్తం చేస్తాయి.అలాగే రతిక్రియ కు ముందు ఒక మంచి పుస్తకం చదివితే  , సినిమానో చూస్తే కూడా  ప్రేయసీ ప్రియులు సిద్ధమవుతారు రతిక్రియకు. ఈ  పరిస్థితులన్నీ ప్రణయ లేక కామ వాంఛ ను  శక్తి వంతం చేస్తాయి.
కామోత్తేజ స్థానాలు అంటే erogenous zones:  అంటే కామాన్ని ఉత్తేజం  చేసే స్థానాలు.: ఈ స్థానాలు  ఆమెలోనూ, అతడి లోనూ  దేహమంతా ఉంటాయి.
కాకపొతే ఈ స్థానాల వల్ల ఒక్కొక్కరూ ఒక్కొక విధంగా ప్రేరేపించ బడి ఉత్తేజం చెందుతారు. అంటే కొన్ని కొన్ని స్థానాలు కొంతమంది లో ఎక్కువ గా ప్రభావితం అవుతాయి.
ఉదాహరణ కు , ఆమెలో  చెవి కింద భాగం లో స్పర్శ ఎక్కువ ఉత్తేజం కలిగించ వచ్చు.అలాగే అతడి చేతిని ఆమె స్ప్తుశించితే అతడు ఎక్కువ ప్రేరేపించ బడ వచ్చు. సాధారణం గా దేహం లో ప్రతి స్థానమూ  కామోత్తేజ  స్థానమే !!
కామోత్తేజ స్థానాలూ, ముందాట గురించి ఇంకొన్ని విషయాలు వచ్చే టపాలో చూద్దాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: