Our Health

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 12.

In Our Health on మార్చి 12, 2012 at 8:43 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 12.
 
 
క్రితం టపాలో చూసినట్లు,  మానవులు తమ జీవిత కాలం లో  ఒకరికన్నా ఎక్కువ మంది తో  అనుబంధాలను ఎర్పరుచుకుంటారు. అది ఒకే సమయం లోనే కాక పోవచ్చు.
వేరే జీవ జాతుల లో  చూసినట్లయితే ఈ అనుబంధాలు  ఏర్పరుచుకునే గుణం, వాటిలో కూడా  నిక్షిప్తమై ఉంటుంది.
ఒక పరిశీలనలో తొమ్మిది వేల జాతుల పక్షులలో తొంభై శాతం కన్నా ఎక్కువ పక్షి జాతులు వాటి  సంగమ దశలో ఇంకో పక్షి తో  అనుబంధం కలిగి ఉంటాయి. అంటే బ్రీడింగ్ సీజన్ లో.
కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ పక్షి జాతులలో యాభయి శాతం కన్నా ఎక్కువ పక్షులు బ్రీడింగ్ సీజన్ లో కలిసిన పక్షులతో జీవితాంతమూ కలిసి ఉండవు. బ్రీడింగ్ సీజన్ అయిపోయి గుడ్లు పొదగటం పూర్తి అయాక వాటి దోవలో అవి పోతాయి. అలాగే  క్షీరదాల లో అంటే స్తన్య జంతువులలో అంటే పిల్లలకు తమ పాలు ఇచ్చి పెంచే జంతువులు కూడా పిల్లలు పుట్టిన తరువాత , వేరు పడతాయి. 
మానవులలో కూడా పుట్టిన వారికి ( అబ్బాయి అయినా అమ్మాయి అయినా ) నాలుగు సంవత్సరాలు వచ్చే సరికి  అయ్యే విడి పోయే వారి  సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. మానవులలో సరాసరి కాలం  అంటే ఒక సారి తల్లి అయి మళ్ళీ తల్లి అవటానికి మధ్య కాలం కూడా నాలుగు సంవత్సరాలే !! 
ఒకసారి పుట్టిన వారు నడవగలిగి వారి బంధువుల నీడలో పెరగ గలిగే బలం తెచ్చుకుంటే, వారి తల్లి తండ్రులు,  వేరే అటాచ్మెంట్లు   లేక ‘ pair bonding ‘ ఏర్పరుచుకునే వారు  అనాది కాలం లో , మళ్ళీ బలవంతమైన , శక్తివంతమైన సంతానం ఉత్పత్తి చేయటం కోసం. ప్రత్యుత్పత్తి జీవ లక్షణం కదా !!
పరిణామ రీత్యా చూస్తే మానవులలో ప్రస్తుతం ప్రబలుతున్న ఎక్కువ మంది తో కామ సంబంధమైన అనుబంధం , మానవ పరిణామం లో  మొదటి దశలలో జరిగిన బ్రీడింగ్ సీజన్ లో మానవుల నడవడిక ను తలపించే పరిణామం యొక్క జీర్ణావస్థ అంటే  ‘ రేమ్నెంట్ ‘ అని అనుకోవచ్చు. 
మానవులలో ఒకే సంబంధం లో  ఎక్కువ కాలం   ఉంటే  కలిగే అసంతృప్తి కి మానవ దేహం లో జరిగే మార్పులు కూడా ప్రోద్బలం కావచ్చు. 
అవి రెండు రకాల కన్నా ఎక్కువ గా ఉండవచ్చు. ఒకటి అటాచ్మెంట్ జరిగేందుకు అవసరమయే జీవ రసాయనాలు, ఎక్కువ అయి అవి జీవ నాడీ కణ గ్రాహకాలను అంటే న్యూరో  రిసెప్టార్స్ ను ఎక్కువ గా క్రియా శీలం చేయవచ్చు. లేక తక్కువ జీవ రసాయనాలు ఉత్పత్తి అయి అవి నాడీ కణ గ్రాహకాలను అంటే మెదడు లో ఉండే న్యూరో రిసెప్టార్స్ ను తక్కువగా  క్రియా శీలం చేయటం వల్ల మానవులు ఇంకో అట్టాచ్మెంట్ లేక ‘  pair bonding  ‘ కోసం తపిస్తూ తనతో ఉంటున్న వారిని వదిలేయవచ్చు.
 
 
తరువాతి టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము. 
 
 
 
  1. I am little bit confused. u might v given a more clear picture

  2. మీరు ఇంతక్రితం హెలెన్ ఫిషర్ చెప్పిన దానిని కోట్ చేశారు. ఒక భార్యను కలిగి ఉండటమే మగవారి సహజమైనదని ఆమే అభిప్రాయం. దానితో నేను ఏకీభవించను. ఎదో కథలు చెప్పటం, పేపర్లు సబ్మిట్ చేయటం,పుస్తకాలు రాసి నాలుగు డబ్బులు సంపాదించుకొవటం అటువంటి వారి పని. ట్రెండ్ కు తగ్గట్లు కథలు అల్లు తారు. మగవారి శారిరక అవసరాల ప్రకారం ఒకరికన్నా ఎక్కువమంది స్రీలతో సంబంద్దాలు కలిగి ఉండటం సహజమైనది. వారసత్వాలు, ఆస్తుల పంపకంలో ఎక్కువమంది భార్యల ద్వారా కలిగిన సంతానం వలన సమస్యలు వచ్చేవి కనుక ఏకపత్ని వ్రతం తలకెత్తుకొవలసి వచ్చింది . అంతేకాని ప్రకృతి పరంగా అది సహజమై కాదు.

  3. To,
    Kastephale ( Sarma gaaru ),
    Please read all the posts to get a clear picture. Which part of the post need clarification?
    best wishes.
    Dr.Sudhakar.

  4. In this post only. Do u mean to say that extra marital or breeding from other person than own husband is better for getting good and healthy children?

    • Certainly not. This article focuses on the trends of love, attachment and lust, in humans and the complex interplay and evolution of these emotions in humans over time . It is trying to discuss the roots of human behaviour, comparing the origins of human species.
      It hypothesizes that the increasing incidence of serial monogamy, adultery and associated human behaviours may be linked with or originated from the primitive or ancient human behaviours. Please go through the remaining posts also about this topic and let me know your views.
      regards,
      Dr.Sudhakar

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: