ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 10.
ప్రేమ:
ఆకర్షణ లేక ప్రణయాకర్షణ , సృష్టి లో ఒక ముఖ్యమైన క్రియ నిర్వర్తిస్తుంది. ఈ ప్రణ యాకర్షణ, క్రమంగా పరిణామం చెంది , ప్రత్యుత్పత్తికి అత్యంత ముఖ్యమైన రతిక్రియ కు మనల్ని సమాయత్తం చేస్తుంది. పోటీ పడుతున్న వారిలో నుంచి, మంచి లక్షణాలు కల, లేక ఎక్కువ ఆకర్షణీయం గా ఉన్న వారితో మన మనసు లగ్నం చేయటానికీ , అంటే కేంద్రీక రించడానికి , ఉపయోగ పడుతుంది.
ఈ ప్రక్రియలో మన శక్తులను అంటే ఎనర్జీ ఒకే భాగస్వామి మీద కేంద్రీకృతం చేసి , స్త్రీల గర్భాశయం లో వీర్య స్ఖలనం జరగటానికి ప్రయోజన కారి గా ఉంటుంది. ( ప్రతుత్పత్తి కి నాంది అవుతుంది, వీర్య స్ఖలనం జరిగి వీర్యం, అండాశయం నుంచి విడుదల ఐన అండం తో సంగమం చెంది నప్పుడు )
కాలక్రమేణా ప్రపంచ మానవ నాగరికత లో జరిగిన పరిణామ రీత్యా , మానవులు ఎవరి ప్రేమ కోసం తపిస్తారో , ఎవరిని ప్రేమిస్తారో , ఈ విషయాలు , వారు పెరిగిన వాతావరణము, నాగరిగతా, దేశ కాల పరిస్థితులు , సంస్కృతీ విలువల మీద ఆధార పడి ఉంటుంది.
ఉదాహరణకు , స్త్రీలు, పురుషులు ఎక్కువగా , పరిచయం లేని, ఆకర్షణీయమైన వ్యక్తుల తో పొందు కోసం తహ తహ లాడతారు. పరిణామ రీత్యా , ఈ లక్షణం , స్వజాతి లో సంపర్కం తగ్గించ డానికి. జీవ పరిణామ రీత్యా , దగ్గరి బంధువులలో జరిగిన వివాహాలు, ప్రత్యుత్పత్తి కంటే, బంధుత్వం లేనివారితో వివాహాలు, ప్రత్యుత్పత్తి వల్ల మన జన్యువులు అంటే ‘ gentetic make up ‘ ఎక్కువ శక్తిదాయకంగా తయారవుతాయి. అలాగని దగ్గర బంధువులలో జరిగిన వివాహాలన్నీ మంచివి కాదని అర్ధం చేసుకో కూడదు. శాస్త్రీయం గా చూస్తే, జన్యువులలో ప్రతికూలమైన మార్పులు రావడానికి అవకాశాలు ఎక్కువ , వివాహ బంధుత్వం రక్త సంభంధం కూడా ఐనప్పుడు , మన ఆచార వ్యవహార రీత్యా చూస్తే ఒకే గోత్రం ఉన్న వారి లో సాధారణంగా వివాహ బంధం, పెద్దలు అంగీకరించక పోవడానికి కూడా ఇదే కారణం.
మనలో ప్రేమ జ్వాల రగిలించడానికి ముఖ్యమైన తైలం – మన బాల్య అనుభవాలు. అంటే మనం ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య మనకు తెలియకుండా అంటే సబ్ కాన్షస్ గా మన మనసులో ఒక ‘ ప్రేమ పటం ‘ చిత్రించు కుంటాము. ఈ అత్యంత వ్యక్తిగతమైన అంటే ‘ very personal ‘ , ప్రత్యేకమైన ప్రేమ పటంలో మనకు కావలసిన భాగస్వామి లక్షణాలు స్కెచ్ ‘ sketch ‘ వేసుకుంటాము. సహజంగా ఈ ‘ rough sketch ‘ మన యుక్త వయసులో సప్త వర్ణాలు కలిసిన ఒక అందమైన ప్రేమ చిత్ర పటం గా మారుతుంది.
మనం ఎప్పుడు, ఎవరితో, ఏ సమయం లో ప్రేమలో పడతామో, ఏ ఆకర్షణ లక్షణాలు మన భాగ స్వామి లో చూస్తామో, ఎప్పుడు సంగమించి, రతిక్రియ లో ఆనంద పడతామో, ఇదంతా మన వ్యక్తిగత లక్షణాల మీద, మన చుట్టూ ఉన్న సాంఘిక , కాల పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుంది.
కానీ ఒకసారి మనం మనకు కావలసిన ప్రత్యెక భాగస్వామిని ఎంచుకున్న తరువాత, మన జీవ రసాయనాలు , తదనుగుణంగా మనలో ఉత్పన్నం అయి , మనల్ని భౌతికంగా కూడా సమాయత్తం చేస్తాయి, ప్రేయసీ ప్రియ సంగమం లోని అత్భుత, ఆనంద అనుభూతులు చవి చూడటం కోసం!!!
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చర్చించుకుందాము !!
విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా వుంది .
రవిశేఖర్ ఒద్దుల
రవి శేఖర్ గారూ,
మీ అభిప్రాయాలకు చాలా ధన్య వాదాలు. ‘ గురు దేవోనమః ‘ అన్న నానుడి మీరు నిజం చేస్తున్నారు. ప్రత్యేకించి ఆరోగ్య విషయాల మీద మీ జ్ఞానం పెంపొందించు కుంటూ.
వీలైనంత మంది కి ఈ బ్లాగు గురించి తెలియ చేయండి. ఆరోగ్య విషయాలను మీ విద్యార్ధులకు పంచండి.
ఇంకా మంచి విజ్ఞాన దాయకమైన వ్యాసాలు మీకు అందించాలనే అభిలాష తో
Dr.సుధాకర్.