ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.
ఈ ప్రణయాకర్షణ హేల – ప్రతి జీవితానికీ ఒక మధురానుభూతుల సుగంధ సుమ మాల !!
క్రింద వివరించిన అనుభూతులు ఇంకా ఏ శాస్త్రవేత్త కూ అంతు పట్టని అనుభూతులు గానే ఉన్నాయి.
ఇవి ఇప్పటి వరకూ ఏ జీవ రసాయనమో కారణం తెలియని ప్రణయ రసానుభూతులు !!
ప్రేయసీ ప్రియులు పరస్పరం ఎమోషనల్ గా అంటే మనోభావ పూర్వకం గా ఆధార పడటం మొదలు పెడతారు.
ఈ భావాలు, ఆశ, బిడియము, భావోద్వేగము, ఒకరి గురించి ఒకరు ఆలోచించ టము, ఒకరిని ఇంకొకరు విడిచి పెడతారని బెంగ పడటము, ఒకరి కొకరు దూరమైనప్పుడు ఆందోళన చెందటము,ఇలాంటివి. ఈ భావాలన్నీ వారిని ఇంకా అప్రమత్తులు గా చేసి ఒకరిని ఒకరు కనిపెడుతూ ఉండేట్టు చేస్తాయి.
వీరు భావ తమ ప్రియునితోనూ , లేక ప్రియురాలితోనూ భావ సంగమానికి తీవ్ర ఉత్కంథత తో ఎదురు చూస్తుంటారు.
తమ తమ దైనందిన కార్యక్రమాలలో, ఏ మాత్రము సంకోచము లేకుండా మార్పులు చేసి, తమ ప్రియురాలితో, తమ ప్రియునితో కలయిక కోసం ఎదురు చూస్తుంటారు.
అవసరమైన మార్పులు, తమ వేష ధారణ లోనూ , అలవాట్లలోనూ , హావ భావాల లోనూ చేస్తుంటారు.
ఒకరి గురించి ఒకరు బాధ్యతాయుతం గా ఉండటము, ఒకరి కోసం ఇంకొకరు త్యాగం చేయటానికి కూడా సిద్ధ పడతారు, ఈ ప్రణయాకర్షణ వల లో చిక్కుకుని !!
ఇక వారి ప్రణయానికి అవరోధాలు ఎంత ఎక్కువ అవుతుంటే అది అంత ఎక్కువ తీవ్రం గా పరిణమిస్తుంది, బలపడుతుంటుంది !!
ఇంకో విషయం:
ఈ ప్రణయాకర్షణ వల లో చిక్కుకున్న ప్రియులు ఒకరితో ఒకరు రతి క్రియ లో సంగమం అవ్వాలని ఎదురుచూస్తూ ఉంటారు, తీవ్రమైన కామ కోరికలతో !! ఈ ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే , తమ ప్రియులు తమకు పోటీ గా అనిపించిన ఎవరితో ఉన్నా అత్యంత అసూయ చెందుతారు.
జీవ పరిణామ పరం గా చూసినట్లయితే ఈ రకమైన మనోభావాలు తాము తమ ప్రియులతో రతిక్రియ లో పాల్గొని అతని లోని వీర్యం ఆమె లో చేరి అండాశయ దిశలో ప్రయాణం చేయటానికి అంటే వారు ప్రత్యుత్పత్తి జరపటానికి ఎంతో ఉపయోగ పడతాయని తెలిసింది.
ఆమె, అతడు, రతిక్రియ కు ముందు మనో భావ సంగమం కోసం తాపత్రయ పడతారు. కానీ పాశ్చాత్య నాగరికతల లో ఎక్కువ మంది ప్రేయసి ప్రియులు, వారు రతీ సంగమమే వారికి మనో భావ సంగమం కన్నా ప్రధానమైనదని ఒక సర్వే లో తెలిపారు.
ఈ ప్రణయానుభూతులూ, రతీ మన్మధులు వారిని గిలిగింతలు పెట్టిన మధురానుభూతులూ, ప్రేయసీ ప్రియుల నియంత్రణ లో ఉండక, వారు ఎంత ప్రయత్నించినా వారి ఆధీనం లో లేక వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
ఈ ప్రణయానుభూతుల ఇంకో ప్రత్యెక లక్షణం ఏంటంటే, అవి తాత్కాలికాలు.
అవరోధాలు ఏర్పడి ప్రేయసీ ప్రియులు, కలవటానికీ, సంభాషించు కోవటానికీ వీలు కానప్పుడు ఆ అనుభూతులు క్రమం గా బలహీనమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులలో పన్నెండు నుంచి పద్దెనిమిది మాసాలలో ఈ అనుభూతులు మాయమయ్యే ‘ అవకాశం ‘ ఉంటుంది.
( ప్రేయసీ ప్రియుల దృష్టి లో ఈ అనుభూతులు మాయమయ్యే ‘ ప్రమాదం ‘ ఉంటుంది. )
ఈ టపా పై మీ అభిప్రాయాలు తెలుపండి.
వచ్చే టపాలో ప్రేమ గురించి వివరాలు చదవండి !!