ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 3.
మునుపటి టపా లో చూసినట్టు,
ఆమెకూ , అతనికీ మధ్య, ఒక నవ్యమైన , ప్రత్యెక మైన అనుభూతి ఈ ఆకర్షణ ! ఇలా ఆకర్షణ కు లోనైన వారి జీవితం లో ఆకర్షిస్తూన్న వారు ఒక ప్రత్యేకత పొందుతారు. వారి జీవితం లో అతి ముఖ్య వ్యక్తులవుతారు.
సాధారణంగా ఆకర్షణ ఒక యువతికీ, ఒక యువకునికీ మధ్య మాత్రమే ఉంటుంది. అంటే ఆకర్షణ కు లోనైన వారు ఏ సమయం లో నైనా ఒక్కరే ఆకర్షిస్తూంటారు. ఈ పరిస్థితి లో వారికి వారి ప్రపంచ పటమే మారిపోతుంది !
ఆకర్షణకు మూలమైన జీవ రసాయనాలు:
ఇలా ఆకర్షణకు లోనవుతున్న వారి మెదడు లో డోపమిన్ అనే రసాయనం ఎక్కువ అవుతుంది. ఈ డోపమిన్ కొత్త వాతావరణం లో ప్రవేశించి నప్పుడు ఎక్కువ అవుతుంటుంది.
ఎలా డోపమిన్ ఎక్కువ అవటం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ! ప్రియురాలు ప్రియుని పైన మనసు ఎక్కువ గా లగ్నం చేస్తే, అప్పుడు, స్తబ్దత తగ్గి , అప్రమత్తత ఎక్కువ అవుతుంటుంది. చేసే పని యందు ఉత్సాహమూ, ఏకాగ్రత కూడా వృద్ధి చెందుతాయి ఈ డోపమిన్ సాంద్రత ఎక్కువ అవటం వల్ల.
అలాగే వారి జీవితం లో తదేక దృష్టి పెరిగి వారు ఒక చేరుకునే లక్ష్యం వైపు వారి మనసు ను లగ్నం చేస్తుంది ఈ డోపమిన్ సాంద్రత ఎక్కువ అయి.
డోపమిన్ తో పాటు నార్ ఎపినెఫ్రిన్ అనే రసాయనం కూడా ఎక్కువ అయి సీరోటోనిన్ అనే రసాయనం మాత్రం తక్కువ అవుతుందని ఇటీవలి పరిశోధనల వల్ల తెలిసింది .
డోపమిన్ తో పాటు నార్ ఎపినెఫ్రిన్ అనే రసాయనం కూడా ఎక్కువ అయి సీరోటోనిన్ అనే రసాయనం మాత్రం తక్కువ అవుతుందని ఇటీవలి పరిశోధనల వల్ల తెలిసింది .
అంతే కాక ఆకర్షణకు లోనైన వారు ఆకర్షిస్తున్న వారిని ఎంత ఏకాగ్రత తో ఆరాధిస్తుంటే అంత డోపమిన్ రసాయనం వారి మెదడు లో ఎక్కువ అవుతుంటుంది.
వచ్చే టపాలో మరి కొన్ని వివరాలు చదవండి, ఆకర్షణ గురించి.
( ఈలోగా మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి )