ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 2.
ఆకర్షణ – లక్షణాలు.
మొదటి దశ లో ఆకర్షణ, ప్రతి మానవ ప్రణయ జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన అనుభూతి !! ఆ అనుభూతి ఒక నూతన తేజాన్ని ఇస్తూంది జీవితానికి.
ఆమె అతనిలో అంతులేని ఆకర్షణ చూస్తూంది. అతడు ఆమెలో ఉండే అన్ని గుణాల వైపూ ఆకర్షించ పడతాడు. ఇద్దరూ ప్రపంచాన్ని ఒక కొత్త కోణం లో చూస్తారు.
సినీ గేయ రచయితలు ఈ ఆకర్షణ లక్షణాలను రమణీయం గా వర్ణించి , పాటల రూపం లో మనకు అందించారు ( వారు ఏ సర్టిఫికేట్ అవసరమూ లేని గొప్ప మానసిక విశ్లేషకులు ఈ విషయం లో !! ).
కొన్ని ఉదాహరణలు చూద్దాము.
నా హృదయం లో నిదురించే చెలీ, కలలలోనే కవ్వించే సఖీ !! మయూరి వై నీవే నటనమాడినావే, నన్ను దోచినావే ……!!,
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, పిలువక పిలిచే కనులలోన, నీ మనసు నాదనుకొంటి లే !!
కదిలీ కదలని లేత పెదవులా తేనెల వానలు కురిసేనులే ! రుస రుస లాడుతు, విసిరినా వాల్జడ, వలపు పాశమని తలచితిలే !!!
తొలివలపే, పదే పదే పిలిచే, మది లో తొందర చేసే !!!,
మనసు పరిమళించెనే, తనువు పరవసించేనే, నవ వసంత రాగము తో, నీవు చెంత నిలువగనే !!
రేపంటీ రూపం కంటీ పూ వింటీ తూపుల వెంటా నా పరుగంటీ !!!,
మనసు పరవసించినే, తనువు పులకరించెనే , నవవసంత రాగము తో, నీవు చెంత నిలువగనే !!!,
తొలివలపే తీయనిది !, మది లో ఎన్నడు మాయనిది !!.
కనులు కనులతో కలబడుతుంటే, ఆ తగవుకు ఫలమేమి ?- కలలే, నాకలలో నీవే కనపడుతుంటే, ఆ చొరవకు బలమేమి ?, మరులే, మరులు మనసు లో స్థిరపడితే ఆ పై జరిగిగేదేమి ?, మనువూ,
మనువై ఇద్దరు ఒకటైతే, ఆ మనుగడ పేరేమి ?, సంసారం !!
వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా ! మెరుపు వలె తళుకు మని మెరిసి పోయే తందుకా ?
దాచాలంటే దాగవులే, దాగుడు మూతలు సాగవులే, వలపుల సంకెల బిగిసే దాకా వదలను వదలను వదలనులే !!
చేను లో ఏముంది ? నీ మేను లో ఏముంది ? చేనులో బంగారం, నీ మేను లో సింగారం అంటూనే పాట చివర నేనులో నీవుంది, నీవులో నేనుంది అంటూ ప్రణయ ప్రపంచంలో ఐక్యమవుతారు ప్రేయసీ ప్రియులిద్దరూ ఈ ఆకర్షణ వలలో చిక్కి !!
కన్నె పిల్లవని, కన్నులున్నవని , ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ? !! చిన్న నవ్వు నవ్వి, ఎన్నెన్ని కలలు రప్పించావే వయ్యారి !!, సంగీతం నువ్వైతే, సాహిత్యం నేనౌతా !!!
పదహారేళ్ళకు, నీలో నాలో, ఆ ప్రాయం చేసే చిలిపి పనులకూ కోటి దండాలు !
వలపు ఏమిటి , ఏమిటి ఏమిటి ? వయసు తొందర చేయుట ఏమిటి ? మనసు ఊయల ఊగుట ఏమిటి ? ఎచట దాగెను రాగల పెనిమిటి? అంటూ ఆమె మతి స్థిమితం కోల్పోయిన భ్రమరం లా ఆడుతూ పాడుతుంది ఈ తొలి వలపు అనుభవాల ఉరవడి కోసం ఉబలాట పడుతూ !!
ఇలా తొలి వలపు, ఆకర్షణ తీవ్రత, ఎంతో బలంగా ఉండి అతడి మనసునూ ఆమె మనసునూ ఆనంద డోలలలో తేలించి ప్రణయ భావాలను మనసులో ఉప్పొంగ చేస్తుంది.
ఇక్కడ గమనించ వలసిన విషయాలు :
అతను సహజంగా ఎక్కువ చొరవ చూపి ఆమె మీద తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు. తొలివలపు అంటే మొదటి దశలలో ఉండే ఆకర్షణ, మన సినీ కవులు రమ్యంగా వర్ణించి నట్టు, కనుల మీదా, పొందు మీదా , పెదవుల మీదా, వయసు మీదా, వయసు తో వచ్చే అందాల మీదా, కేంద్రీకరించ పడ్డాయి. ఆమె చిరుకోపం తో తన వాలు జడను విసిరినా, దానిని, ఆమె ఆకర్షణ మోహంలో వలపు పాశం గా భావించుతూ, ఇంకా కవ్విస్తున్నాడు !!
ఇక ఆమె, అత్యుత్సాహం తో పరవశించి పోతూ , అతనిని తన జీవిత సహచరునిగా ఊహించుకొంటూ, తమ ఇద్దరి పొందూ ఎంత అత్భుతంగా ఉంటుందో అని స్వప్న మేఘాల పై తేలియాడు తుంటుంది. ఆమె ప్రపంచం లో కేవలం ఆమె, అతడే !! ఆ క్షణాలలో ! ఇంకెవ్వరూ ఆమె ఆలోచనలలోనూ, అనుభూతులలోనూ ఉండరు ప్రముఖంగా !!
ఈ తొలి వలపుల ‘ సంకెల ‘ అంత బలీయమైనది అందుకే ! అంత నూతనమైనదీ, ప్రత్యేకమైనదీ నూ, ప్రతి ఒక్కరికీ !!!
ఆకర్షణ గురించి మరికొన్ని ఆకర్షణీయ మైన విషయాలు వచ్చే టపాలో చదవండి !!
( ఈలోగా మీ ఈ టపా పై మీ అభిప్రాయం తెలియ చేయండి ! )
I am reading ur blog fine
Many thanks Sarma gaaru,
Please recommend this site to your friends.
Sudhakar.