ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – ఇవి మానవ జీవితాలల్లో అతి ముఖ్య మైన అనుభూతులు.
మన జీవితాలల్లోని వేరు వేరు దశల్లో ప్రవేశించి, మనలో పెన వేసుకు పోయి విడదీయరాని బంధాలు అవుతాయి మనకు.
ఈ అనుభూతుల ఉప్పెనలలో అలా తేలిపోతూ ఆనందించేవారు కొందరు, కొట్టుమిట్టాడుతూ జీవిత నౌకలో తికమక పడేవారు కొందరు, కొట్టుకు పోయే వారు ఇంకొందరు !.
ఈ అనుభూతులు సమ తుల్యం లో ఉంటే అది సుఖ జీవన సోపానానికి నాంది అవుతుంది.
తరచూ మనలో చాల మంది ఈ సమతుల్యం ప్రాముఖ్యత తెలుసుకోలేము. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు.
కేవలం అనుభూతుల లా కాకుండా శాస్త్రీయ మూలాల పైన పరిశోధనలు జరిగాయి, వీటి కదా కమామీషు తెలుసుకోడానికి.
వీటి ఫలితాలు తెలియ చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.
ఇవి తెలుసుకోవడం అందరికీ అవసరమే, ముఖ్యం గా యవ్వనులకు ( టీనేజేర్స్ ) !.
ఆకర్షణ గురించి వచ్చే టపా లో చదవండి !