పొగాకు కు ఋణం – ప్రాణం పణం . 7. సెకండ్ హ్యాండ్ స్మోక్ ‘ SHS ‘ గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలి?
సెకండ్ హ్యాండ్ స్మోక్ ( SHS ) రెండు రకాలు:
మొదటి రకం: మన చుట్టూ ఉన్నవారెవరైనా పొగాకు పీలుస్తున్నప్పుడు ఆ పొగను మనం కూడా పీల్చడం. ( అంటే మనము సిగరెట్టు వెలిగించ కుండా ) ( దీనిని ‘ side stream smoke ‘ అంటారు ).ఇట్లాంటి పొగ ఎక్కువ ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ పొగ నేరు గా సిగరెట్టు నుంచి వస్తూంది కదా, మనం వెలిగించక పోయినా !!.
రెండో రకం: మన చుట్టూ పొగాకు పీల్చేవారు పీలుస్తూ ఒదిలేసిన పొగను మనం పీల్చడం ( దీనిని ‘ main stream smoke ‘ అంటారు ).
ఈ రెండు రకాల పొగాకు పొగ కూ, పొగాకు ‘ తాగని వారు ‘ ఎంత ఎక్కువ కాలం ఎక్స్పోజ్ ‘ expose ‘ అవుతే అంత ఆ పొగ చేసే హాని మనలో !!. అంటే మనం ప్యాస్సివ్ స్మోకర్స్ ‘ passive smokers ‘ లేక అనియంత్రిత స్మోకర్స్ లేక ‘ involuntary smokers ‘ అవుతాము అన్న మాట !!
కొన్ని పరిశోధనల వల్ల చిన్న పిల్లలలో వచ్చే కొన్ని రకాల రక్త క్యాన్సర్ ల కూ , వారు పీల్చే సెకండ్ హ్యాండ్ స్మోక్ కూ సంబంధం ఉందని తేలింది. అట్లాగే స్త్రీలలో వచ్చే స్థన క్యాన్సర్ కూ ( అంటే ‘ breast cancer ‘ కు ) ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ కూ సంబంధం ఉందని తెలిసింది.
ఇవి కాక పొగాకు పీల్చేవారిలో వచ్చే క్యాన్సర్లు అన్నీ కూడా వారి పక్క న ఉండి పైన చెప్పిన రెండు రకాల పొగలనూ పీల్చే వారిలో వస్తాయని ఖచ్చితంగా పరిశోధనల వల్ల తేలింది.
అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా లో కేవలం పొగాకు ‘ తాగే ‘ వారి చుట్టూ ఉన్న ‘ 46,00 ‘ మంది అంటే అక్షరాలా నలభై ఆరు వేల మంది ‘ ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ ‘ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు,
ప్రతి సంవత్సరమూ !!. అందులో ‘ 3,400 ‘ మంది అంటే మూడు వేల నాలుగు వందల మంది ఊపిరి తిత్తుల క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు కేవలం పొగ పీల్చే వారి చుట్టూ ఉన్న పాపానికి !!!
చిన్న పిల్లలో న్యుమోనియాలూ , ఆస్థ్మా జబ్బులు కూడా ఎక్కువ గా వస్తూండ డానికి కూడా ‘ పెద్దలు ‘ బాధ్యతా రహితంగా ఇంట్లో చిన్న పిల్లల చుట్టూ పొగ తాగిన ఫలితమే అని ఖచ్చితం గా పరిశోధనలు రుజువు చేశాయి. బహిరంగ ప్రదేశాలలో , సొంత ఇళ్ళలో , బస్సులలో , రైళ్ళలో, మనం ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ కు ఎంత ఎక్కువ గా పొగ పీలిస్తే అంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది మనం మన తప్పు ఏమీ లేక పోయినా !!
అంటే ఒక విధంగా ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ పూర్తిగా మానవ కారణమైన అంటు వ్యాధి అన వచ్చు!!!.
.