సిగరెట్ ‘ తాగే వారికి ‘ ఆ కోరిక ఎట్లా బలపడుతుంది?
మన నాడీ మండలం పైన పొగాకు ప్రభావం:
ఇది రెండు విధాలు గా జరుగుతుంది:
మొదట గా తెలుసుకోవలసినది: ప్రారంభ దశలో జరిగే మార్పులు. అంటే అంత కు ముందు టొబాకో అంటే పొగ తాగని వారు పొగ తాగటం లేక పీల్చడం మొదలు పెట్టినప్పుడు వారి మెదడులో జరిగే మార్పులు.:
మెదడు లో . VTA . అంటే వెంత్రాల్ తెగ్మేన్తల్ ఏరియా అనే ఒక భాగం లో ‘ GABA ‘ అంటే గాబా అనే ప్రత్యెక మైన నాడీ కణాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన నాడీ కణాలను పీల్చిన పొగాకు లో ఉన్న నికోటిన్ ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావితం చేసే క్రియ లో ‘ nAChR ‘ అంటే నికోటిన్ తో ప్రభావితమైన ఎసిటైల్ కోలిన్ గ్రాహకాలు క్రియా శీలం అవుతాయి. ఇవి ఈ విధంగా క్రియా శీలం అవటం వల్ల ఒక రివార్డు అంటే ‘ reward ‘ అనుభూతి ని పొగ పీల్చిన వారు పొందుతారు. ఈ రివార్డు అంటే బహుమతి పొందిన అనుభూతి ప్రత్యేకించి ‘ nAChR ‘ కు ఉన్న ఆల్ఫా సెవెన్ ‘ alpha seven sub unit ‘ క్రియాశీలం అవటం వల్ల కలుగుతుంది
ఇదే సమయంలో నికోటిన్ nAChR ‘ పైన ఉన్న బీటా టూ అంటే ‘ Beta two sub unit ‘ నే ప్రభావితం చేయడం కాకుండా , ‘ గాబా అంటే ‘ GABA ‘ మరియూ డోపమిన్ అంటే ‘ DA receptors’ ను కూడా క్రియాశీలం చేస్తుంది. ఈ విధంగా వీటిని క్రియాశీలం చేయటం వల్ల ఉత్సాహం పొందిన అనుభూతి కలుగుతుంది.
ఇక్కడ ఇంకో విషయం. నికోటిన్ అంటే ‘ విముఖత ‘ అంటే ‘ aversion signal ‘ కూడా మెదడులో ఉంటుంది. కానీ ఈ ‘ విముఖత ‘ కలిగించే సిగ్నల్ ను నికోటిన్ ప్రారంభ దశలో అంటే మొదటి పర్యాయాలు పొగ పీలుస్తున్నప్పుడు లేక పొగ తాగుతున్నప్పుడు ప్రభావితం చేయదు. అంటే పొగ పీల్చే వారికి పొగ తాగటం అంటే విముఖత కూడా ఏర్పడుతుంది ఈ దశలో .
ఇక రెండో దశలో మెదడు లో జరిగే మార్పులు:
క్రమంగా ఎక్కువ సార్లు, చాలా కాలం పొగ పీలుస్తున్నప్పుడు ‘ గాబా రివార్డు వ్యవస్థ ‘ అంటే ‘ GABA reward system ‘ నికోటిన్ వల్ల ప్రభావితం అవటం మందగిస్తుంది అంటే ‘ desensitize ‘ అవుతుంది. దీని వల్ల డోపమిన్ వ్యవస్థ అంటే ‘ DA system ‘ ఎక్కువ క్రియా శీలం అవుతుంది. గ్లుటామిన్ అనే నాడీ ప్రసారక రసాయనం కూడా ఈ డోపమిన్ ను క్రియాశీలం చేయటం లో కొంత పాత్ర వహిస్తుంది. డోపమిన్ ఎక్కువ గా క్రియాశీలం అవటం వల్ల ‘ విముఖత ‘ ఎక్కువ గా ఏర్పడి నికోటిన్ మళ్ళీ మళ్ళీ కావాలనుకునే ఒక బలమైన కోరిక ఏర్పడుతుంది పొగ తాగే వారిలో .అంటే వారు మళ్ళీ మళ్ళీ పొగతాగే అవకాశం కోసం ఎదురు చూసి రోజులో ఎక్కువ సార్లు పొగ తాగుతారు ఈ బలమైన కోరిక వల్ల అంటే ‘ craving ‘ వల్ల.
వచ్చే టపాలో పొగ తాగటం వల్ల వచ్చే మరికొన్ని మార్పులు చదవండి.