Our Health

డిప్రెషన్ ఆత్మకథ – 2. ( నేను మీలో తెచ్చే మార్పులు )

In Our Health on జనవరి 29, 2012 at 10:50 సా.

డిప్రెషన్ ఆత్మకథ – 2

నేను మీలో తెచ్చే మార్పులు :

నిద్ర లేమి : మీరు నిద్ర సరిగా పోలేకపోవటం, కలత నిద్ర లూ , ఎప్పుడూ ఉదయమే లేవనివారు కూడా నాలుగు , అయిదు గంటలకే లేవటం, లేక గంటా రెండు గంటలు పడుకొని మెలకువ వచ్చి లేచి మళ్ళీ ఒకటి రెండు గంటలు అయినాక కానీ నిద్ర రాకపోవడం, ఇవన్నీ నేను మీతో ఉన్నప్పుడు జరిగే తొలి మార్పులు. ఇలాంటి మార్పులవల్ల రోజంతా స్తబ్దు గా ఉండటమూ, ఏ పని మీద శ్రద్ధ చూపలేక పోవడం, తరచూ చీకాకు పడుతూ ఉండడం జరుగుతూంటాయి.
కొందరిలో నా వల్ల ఎక్కువగా నిద్ర పోవడం కూడా జరుగుతుంది కానీ సాధారణంగా ఎక్కువ మందిని నేను నిద్ర లేమి తో బాధ పెడతాను. ఈ సహజ నిద్ర లో జరిగే అవకతవకల వల్ల మీరు మీ రోజువారీ పనులు సరిగా చేయలేక టీలూ కాఫీలు ఎక్కువగా తాగటం చేస్తూ ఉంటారు. ఇంకొందరు మద్యం సేవిస్తే ప్రశాంత పడి నిద్రపోతామనుకుని ‘ మందు’ సేవిస్తారు. కానీ ఫలితం చాలా తాత్కాలికం మాత్రమే !!
ఆకలి తగ్గిపోవడం: ఇక ఆకలి క్రమంగా తగ్గుతూ పోతుంది. ఎందుకంటే నేను వారిని తినడం మొదలు పెడతా కదా ! ఈ ఆకలి తగ్గటం వల్ల మంచి రుచికరమయిన వంటలు కూడా రుచించక తినడం మానేస్తారు మీరు. అలాగే పానీయాలు కూడా తాగటం తగ్గిస్తారు మీరు. వీటి వల్ల బలహీన పడటమూ, శక్తి హీనులు అవడమూ , బరువు తగ్గిపోవడమూ జరుగుతాయి.
ఇక నేను తెచ్చే ముఖ్యమయిన మార్పు ఆలోచనా ధోరణి. నిరాశా నిస్పృహలు మీలో ఎక్కువ అవుతుంటాయి . పాజిటివ్ దృక్పధం మారి మీరు నిరాశా వాదులవుతారు.
మీ ఆలోచనలు వెలుగు కాక చీకటి పయినే పయనిస్తూ ఉంటాయి. మీరు వర్తమానం మీదా భవిష్యత్తు మీద నిరాశాజనకంగా ఉంటారు. మీ కోరికలూ మీ పథకాలూ అన్నీ నిరాశాజనకంగా ఉహించి కుమిలిపోతూ ఉంటారు నేను మీతో ఉన్నప్పుడు.అంత క్రితం వరకూ చలాకీ గా చురుకు గా ఉండే వారు నిద్రాణ స్థితి లో తలిదండ్రులకు, తోబుట్టువులకు, బంధువులకు, స్నేహితులకు మొహం చాటు చేసి ఎక్కువ గా ఏకాంతం లో గడుపుతారు. సెల్ లో మాట్లాడటం తగ్గించేస్తారు. మగ వారిలో కామోద్రేకం సన్నగిల్లి రతి సామర్థ్యం తగ్గి పోతుంది. దీనితో వారు ఇంకా కుంగిపోయి నాకు ఇంకా దగ్గర అవుతారు. స్త్రీలలో కూడా కామ కోరికలు తగ్గి ముబావంగా ఉంటారు నా పొందు తో !!.
ఆత్మన్యూనత ఏర్పడి మీరు చేసిన ఏవో కొన్ని సాధారణ పొరపాట్లను కూడా ఎక్కువ గా ఉహించుకొని కలత చెందుతూ ఉంటారు. మీ పరిస్థితి అంతా మీ తప్పిదం వల్లే అని భ్రమ పడుతూ ఉంటారు. నేను మీతో ఉండటం వల్ల నే ఈ మార్పులు వచ్చాయనే సత్యాన్ని మరచి పోతారు.చాలామంది వారికి తెలియకనే కడుపులో నొప్పి అనో, గుండెలో నొప్పి అనో వైద్యుల చుట్టూ తిరుగుతూ విపరీతంగా డబ్బు ఖర్చు చేసి ఆందోళన చెందుతూ ఉంటార్రు, నేను వారిని పట్టుకున్నాననే విషయం గ్రహించక!!! కొందరు విపరీతమయిన నిరాశ చెంది ‘ ఇక లేవకుండా నిద్ర పోవాలనుకుని’ నిద్రమాత్రలు ఎక్కువ మోతాదు లో తీసుకుని ప్రమాదకర స్థితి లో ఆసుపత్రుల పాలవుతారు. కొందరు వారు ఆ స్థితి లో ఉండటానికంతటికీ వారే కారణమని, దానికి పరిష్కారం వారు ఈ ప్రపంచం నుండి ‘ శలవు తీసుకోవడమే ఉత్తమమని’ ఆత్మహత్య కు పాల్పడతారు. ఇటీవల ఆంధ్రదేశంలో , భారత దేశంలో చూస్తూన్న రైతుల ఆత్మహత్యల పరంపర దీనికి ఒక ఉదాహరణ మాత్రమే . అదే నేను చేసే మాయాజాలం!!!

నా ఉనికిని మీలో ఎలా కనుక్కోవాలో వచ్చే టపాలో చదవండి !

  1. మీరు ఇస్తున్న సమాచారం బావుంటోంది కానీ మరీ చిన్నపిల్లల కథలా కాకుండా మామూలుగా వివరిస్తే ఇంకా బావుంటుంది.

    • ధన్యవాదాలు. ఒకే మూసలో కాక చదువరులు గుర్తు పెట్టుకునే విధంగా ఇలా కథ రూపంలో వ్రాయడం జరుగుతుంది. మరి మిగతా వారు ఏమంటారో వేచి చూడాలి.
      భవదీయుడు
      డాక్టర్ సుధాకర్.

  2. na opinion lo ila express cheste ne bagundi sarath garu. It is like as if your feelings are talking to you.
    Today I am in a small dipression and I felt good after reading it. Thanks a lot to sudhakar.

  3. Hi Sree,
    Thanks for your comments. Please read all five parts. The purpose of the article, for that matter all the articles in this blog is to benefit most. Feel free also to ask questions. ( Don’t bother to reply in telugu only, if you can’t for any reason ).
    best wishes.
    Sudhakar

  4. సత్యహరిశ్చంద్రుడు
    సత్యహరిశ్చంద్రుడి పేరు వినని వాళ్ళు దాదాపుగా ఉండరు. “అబద్ధం చెప్పావేంటి?” అంటే “నేనేం సత్యహరిశ్చంద్రుడిని కాను” అనడం, “ఎట్టి పరిస్థితిలో నిజమే చెప్తాను” అంటే “అబ్బో, సత్యహరిశ్చంద్రుడు కాబోలు” అనడం మామూలే. చాలాసార్లు సత్యహరిశ్చంద్రుడు మనకు ఆదర్శం. ఒక్కోసారి ఆయన పేరు చెప్పి నవ్వుకుంటాం కూడా. ఇంత ప్రాముఖ్యం ఉన్న సత్యహరిశ్చంద్రుడి కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.

    సత్యహరిశ్చంద్రుడు సూర్యవంశపు రాజు. ఆయన నిజమే చెప్తాడు అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. దాంతో విశ్వామిత్ర మహర్షికి సత్యహరిశ్చంద్రుని పర్రిక్షించాలి అనిపించింది. వెంటనే వచ్చి తనకు ధనం కావాలని అడిగాడు. హరిశ్చంద్రుడు వెంటనే, ఎంత కావాలంటే అంత తీసుకువెళ్ళమన్నాడు. కానీ విశ్వామిత్రుడు “ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుంటాను” అని చెప్పి వెళ్ళాడు.

    కొన్నాళ్ళకు విశ్వామిత్రుడు తిరిగివచ్చి, తాను సృష్టించిన మాతంగ కన్యలను పెళ్ళి చేసుకోమన్నాడు.

    హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, కనుక మరో పెళ్ళి చేసుకునే ప్రశ్నే లేదని, రాజ్యం పోయినా పరవాలేదు, ఏకపత్నీవ్రతం తప్పను” అన్నాడు.

    విశ్వామిత్రుడు “సరే, అయితే రాజ్యం వదిలి వెళ్ళు” అన్నాడు.

    హరిశ్చంద్రుడు క్షణం కూడా ఆలోచించకుండా, భార్య చంద్రమతి, కొడుకు లోహితాస్యులను వెంటబెట్టుకుని అడవులకు వెళ్ళడానికి తయారవగా “రాజా, నువ్వు నాకు ఇస్తానన్న డబ్బు ఇచ్చి వెళ్ళు” అన్నాడు. అప్పటికే హరిశ్చంద్రుడు రాజ్యాన్ని ఇచ్చేశాడు గనుక ఇక ఆ ధనం తనది కాదు. కనుక “నేనిప్పుడు కట్టు బట్టలతో ఉన్నాను కనుక, ఒక నెల గడువు ఇస్తే, ఆ ధనం తెచ్చిస్తాను” అన్నాడు. విశ్వామిత్రుడు అందుకు ఒప్పుకుని, నక్షత్రకుని వెంట పంపాడు.

    అప్పటిదాకా మహారాజు అయిన హరిశ్చంద్రుడికి రాజ్యపాలనే తప్ప ఇతర పనులు చేతకావు. తిండితిప్పలు గడవడం కూడా కష్టమైంది. ఎన్నడూ రాజమహలు దాటి బయట కాలు పెట్టని చంద్రమతి అడవుల పాలై నానా కష్టాలూ పడుతోంది. పైగా చిన్నవాడైన లోహితాస్యునికీ కష్టాలు తప్పలేదు. ఇవి చాలక కూర్చున్నా, పడుకున్నా వేధించే విశ్వామిత్రుడి శిష్యుడు నక్షత్రకుడు.

    హరిశ్చంద్రుడు నానా అగచాట్లూ పడుతూ అడవుల్లో నడుస్తున్నాడు. ఇంతలో అడవిలో మంటలు రేగాయి. బాధాతప్త హృదయంతో ఉన్న చంద్రమతికి విరక్తి వచ్చింది. ఆ మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకోబోయింది.ఆ మహా సాత్వీమణిని దహించడం ఇష్టం లేక, మంటలు చల్లారాయి.

    హరిశ్చంద్రుడు కాశీ విశ్వేశ్వరుని గుడికి దారితీశాడు. అందరూ దేవుని దర్శించుకున్నారు. అప్పు త్వరగా తీరిస్తే, తాను వెళ్తానని నక్షత్రకుడు పీడిస్తున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునే ఎవరైనా ఒక విషయం గురించి పదేపదే నసుగుతుంటే, “నక్షత్రకుడిలా వేధించుకు తింటున్నావు” అంటారు. “పోనీ, అప్పు తీర్చలేవా? ఆ మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను” అంటాడు నక్షత్రకుడు. విశ్వామిత్రుడి ధ్యేయమే అది. సత్యనిష్ఠ తప్పించడం.

    అదంతా చూసిన చంద్రమతికి మనసు ద్రవించింది. “రాజా. నన్ను అమ్మేసి, ఆ ధనంతో ఋణ విముక్తి చేసుకో” అంది.

    హరిశ్చంద్రుడికి భార్య సహకారం ఊపిరినిచ్చింది. భార్య కంటే, సత్య వ్రతమే ముఖ్యం అనిపించింది. కాలకౌశికుడు అనే బ్రాహ్మణునికి చంద్రమతిని అమ్మి, ఆ ధనాన్ని విశ్వామిత్ర మహర్షికి ఇమ్మన్నాడు హరిశ్చంద్రుడు.

    కానీ, అంతటితో కథ పూర్తి కాలేదు. నక్షత్రకుడు ఆ ధనం తన దారి ఖర్చుకే సరిపోతుందని, గురువుగారికి ఏమివ్వాలని అడిగాడు. హరిశ్చంద్రుడు నివ్వేరపోయినా, వెంటనే తేరుకున్నాడు. కర్తవ్యం ఆలోచించాడు. దగ్గర్లో ఉన్న వీరబాహువు అనే కాటి కాపరికి తనను తాను అమ్ముకుని, ఆ ధనాన్ని నక్షత్రకునికి ఇచ్చి పంపాడు.

    అక్కడికీ హరిశ్చంద్రుడి కష్టం తీరలేదు. చంద్రమతిని, కాలకౌశికుని భార్య కాలకంటకి, ఆమెను సాధింపులతో, వేధింపులతో బాధ పెడుతోంది. ఇంతలో లోహితాస్యుడు పాము కరిచి, చనిపోయాడు. కొడుకు మరణించాడనే పిడుగువార్తను జీర్ణించుకోలేకపోయింది. చంద్రమతి కొడుకు శవాన్ని భుజాన వేసుకుని స్మశానానికి వెళ్ళింది.

    చంద్రమతి దగ్గర కట్టెలు లేవు. సగం కాలిన కట్టేలతోనే కొడుకు మృతదేహానికి చితి పెర్చబోయింది. అది చూసిన కాటికాపరి ముందు కాటి సుంకం ఇవ్వమని అడిగాడు.

    చంద్రమతి తన వద్ద డబ్బు లేదని, కొడుక్కు దహన సంస్కారం చేయడానికి ఒప్పుకోమని బతిమాలింది. అయితే, మంగళసూత్రం ఉంటే ఇవ్వమన్నాడు కాటికాపరి. చంద్రమతి, తన మంగళసూత్రం భర్తకు మాత్రమే కనిపిస్తుందని, ఇతరులకు కనిపించదని, అది వశిష్ట ముని వాక్కని చెప్పింది.

    అప్పటికి అతనికి ఆమె ఎవరో అర్ధమైంది. ఆ కాటికాపరి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే. ఇద్దరూ చలించిపోయారు. కొడుకును తల్చుకుని ఏడ్చారు.

    ఇంతలో, “ఆమె హంతకి.. అందునా రాజ కుమారుని చంపింది.. శిరచ్చేదం చేయాలి” అంటూ రాజభటులు వచ్చారు.

    హరిశ్చంద్రుడు దుఃఖసాగరంలో కూరుకుపోయి కూడా, కర్తవ్య నిర్వహణలో పడ్డాడు. చంద్రమతిని వధ్యశిల దగ్గరికి తీసికెళ్ళి, తలను ఖండించబోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి, “ఒద్దు, రాజా, అలా చేయొద్దు” అన్నాడు.

    “నేను ఇప్పుడు కాటికాపరిని మాత్రమే. భార్యాపిల్లలు అనే మమకారాలు తగవు” అన్నాడు.

    దాంతో, విశ్వామిత్రుడు పరమేశ్వరుని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై లోహితాస్యుని బతికించాడు. భార్యాభర్తల సంతోషానికి అంతు లేకపోయింది. హరిశ్చంద్రునితో “నీ పేరు శాస్వతంగా నిలిచిపోతుంది” అని అంతర్ధానం అయ్యాడు మహాశివుడు.

    “నీ సత్యనిష్ఠ సామాన్యమైంది కాదు, ఎన్ని విధాల పరీక్షించినా గెలిచావు.. నీకు అపారమైన కీర్తి వస్తుంది” అంటూ దీవించాడు విశ్వామిత్రుడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: