మన ఆశావాదానికి మూలాలు
భవిష్యత్తు గతం కన్నా, వర్తమానం కన్నా బాగు గా ఉంటుందని అనుకోవడమే ఆశావాదం. యదార్ధానికి మన పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా కూడా ఆశాజనకంగా ఊహించు కోవడం అన్న మాట! ఈ విషయం ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది. అంటే మానవులు సహజంగా యదార్ధానికంటే ఆశావాదులు గా ఉండటానికే సిద్ధపడతారన్న మాట.
మనం సహజంగా నిరుద్యోగులవడమో, సహచరుల కన్నా ఎక్కువ సాధ్యులవడమో ( achievers ), విడాకులు తీసుకోవడం, లేక కాన్సర్ రావడమో , ఇలాంటి విషయాల్లో యదార్ధాన్ని తక్కువగా అంచనా వేస్తామని పరిశోధనల వల్ల విశదమయింది.
చిన్న పిల్లల్లో ఆశావాదం ఎక్కువగా ఉంటుంది. మనం పెరుగుతూన్న కొద్ది ఇది కూడా పెరిగి అరవై ఏండ్ల నుంచి తగ్గుతూ వుంటుంది.
ప్రకృతి విపరీతాలు సంభవించినప్పుడు మనం భవిష్యత్తు ను నిరాశాజనకం గా ఊహించుకోవడం జరుగుతుంది. ఈ పరిణామం ఎక్కువగా సామూహిక పరిణామం గా కనిపిస్తూంది
కాని వ్యక్తిగతంగా మనం ఊహకందని విధంగా మన భవిష్యత్తు మీద పాజిటివ్ గా ఆశాజనకం గా ఉంటాము.
ఈ ఆశావాద పక్ష పాతం ( optimism bias ) కొన్ని అవాంచనీయ పరిణామాలకు దారి తీయ వచ్చు. అతి సాధారణం గా జరిగే సంఘటన మన ఆరోగ్యం పై మన అశ్రద్ధ .
మానవ దేహం ప్రకృతి లో జరిగిన అత్యద్భుతమయిన సంఘటన. మన దేహం లో ప్రతి క్షణమూ అనేక వేల జీవ రసాయన చర్యలు జరుగుతూ వుంటాయి. ఏ భాగం లో ఏ అసమతుల్యం
( imbalance ) జరిగినా దాని పరిణామాలు మొదట లక్షణాలు ( symptoms ) గా కనిపిస్తాయి. ఈ లక్షణాలు ముందు ముందు ప్రబలమయే వ్యాధి లక్షణాలన్న మాట. ( warning signals అనవచ్చు వీటిని ). మనం ఈ తోలి దశల్లో సంభవించే లక్షణాలని మనం నిర్లక్ష్యం చేస్తాము.కొద్దిగా తల నొప్పి గావుంటే పారసిటమాల్ బిళ్ళలు ( paracetamol tablets ) వేసుకుంటే తగ్గిపోతుంది పరవాలేదులే అనుకుంటాము. ఆ తల నొప్పికి కారణాలు అన్వేషించము ఈ ఆశావాద పక్షపాతం వల్ల.స్టాక్ మార్కెట్ లో డబ్బు పెడతాము రిస్కులు తెలుసుకున్నా కూడా.
ఇక లాభాల మాటకొస్తే చాల వున్నాయి.
ఆశావాదులు ఎక్కువ ఆనందంగా వుంటారు. కష్టపడి పని చేస్తారు. నిరాశావాదులకంటే ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు కూడా! వారి వారి లక్ష్యాలు చేరటానికి కూడా ఆశావాద దృక్పధం బాగా సహకరిస్తుంది.
జ్ఞాన కాల ప్రయాణం ( cognitive time travel ) :
మనం మన భవిష్యత్తు గురించి గొప్పగా ఊహించే ముందు మనం ఊహాజీవులం కావాలి. సహజసిద్ధంగా మానవులలో ఈ ప్రత్యేకత పరిణామం చెందింది.
ఎక్కడో, ఎప్పుడో మరణం తప్పదనే నిజం వల్లనే ఈ జ్ఞాన కాల ప్రయాణం అనే ప్రత్యెక లక్షణాన్ని మనం వృద్ధి చేసుకున్నాము కాలానుగుణం గా.
మన మెదడు లో హిప్పో కాంపస్ అనే ఒక భాగం ఈ ప్రత్యెక లక్షణానికి మూలం. ఈ భాగం ఏ కారణం వల్ల నైనా దెబ్బ తింటే గతం లో జరిగిన సంఘటనల తో పాటు భవిష్యత్తు ను ఊహించుకోవడం కూడా సాధ్యపడదు. ఇక మెదడు ముఖ భాగం ( frontal cortex ) మెదడు లోపల వుండే భాగాలతో జటిల మైన అనుసంధానం జరుపుతూ వుంటుంది. ఈ ఫ్రాన్తల్ కార్తెక్ష్ ఈ అనుసంధానం వల్ల భవిష్యత్తు ను పాజిటివ్ గా ఊహించడం, వాటికి సంబంధించిన పధకాలు ఆలోచించడం మొదలైన క్రియలు చేస్తూ ఉంటాము.
[ మిగతా భాగం తరువాతి టపా లో ]
ఆశావాదం వల్ల లాభ నష్టాలగురించిన వివరణ బాగుంది సర్.
కృతఙ్ఞతలు కొండలరావు గారూ !