
న్యూ యార్క్ లో 2001 లో సంభవించిన టెర్రరిస్టుల దాడి మీద ప్రజల జ్ఞాపకాలు ఎలా ఉన్నాయని ఒక పరిశోధన జరిగింది ఇటీవల. ప్రజల జ్ఞాపకాలు 11 నెలల వ్యవధి లో రెండు మార్లు సర్వే జరిగినప్పుడు కేవలం 63 శాతం మంది మాత్రమె జరిగిన సంఘటనలను మర్చి పోకుండా సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకున్నారుట.
దీనికి కారణాలు వెతికినప్పుడు శాస్త్రవేత్తలకు మానవుల జ్ఞాపక శక్తి కేవలం గడిచిన సంఘటనలను మాత్రమె కాక భవిష్యత్తు లో జరుగబోయే సంఘటనలను దృష్టి లో ఉంచుకుని వాటి పరిణామాలకు కూడా సన్నద్ధులవుతారని తెలిసింది. అంటే మన నాడీ వ్యవస్థ ( nervous system ) లో కేవలం గత స్మృతులే కాక భవిష్యత్తు ను ఆశాజనకంగా ఊహించుకునే గుణం కూడా ఉన్నదన్న మాట.ఈ భవిష్యత్తు గురించిన ఆలోచనలు మనకు కొన్ని నిరాశాజనకంగా వున్నా మనం ఎక్కువ సమయాన్ని ఆశాజనకమయిన విషయాలు, సంఘటనల పయినే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటాము .
నాడీ మూలాలు : ఒక పరిశోధనలో వాలంటీర్లను రెండు జట్లుగా విడదీసి మొదటి జట్టు వారిని భవిష్యత్తును ఆశాజనకంగా నూ రెండవ జట్టువారిని నిరాశాజనకంగానూ ఊహించుకోమ్మనటం జరిగింది. ఈవిధంగా ఆలోచిస్తూన్నవారి మెదడు ను fMRI అనే శక్తివంతమయిన పరికరం తో రికార్డు చేసి ఫలితాలను పోలిస్తే మెదడు లో రెండు ముఖ్యమయిన భాగాలు ఎక్కువ క్రియాశీలంగా వున్నాయని స్పష్టమయింది. ఈ భాగాలే అమిగ్డలా ( amygdala ) మరియూ రోష్ట్రల్ యాన్టీరియర్ సిన్గులేట్ కార్టెక్స్ ( rACC ) పైన ఉన్న పటం చూడండి.అమిగ్డలా మన మెదడు లోపలి భాగం. ఈ భాగం మన భావాలనూ, అనుభూతులనూ సంవిధానం అంటే processing చేస్తూ ఉంటూంది. రోష్ట్రల్ యాన్టీరియర్ సిన్గులేట్ కార్టెక్స్ ఒక ట్రాఫిక్ కంట్రోలర్ గా వ్యవహరిస్తూ, మన మెదడులో ప్రవేశించే ఆలోచనలను నియంత్రించి ప్రధానంగా ఆశావాద అంటే పాజిటివ్ ఆలోచనలను ఎక్కువగా అమిగ్డల వైపు పంపుతూ ఉంటూంది. మానవులు ఎంత ఆశావాదులుగా వుంటే అంత బలవంతంగా ఈభాగాలు రెండూ అనుసంధానమయి వుంటాయి. మనము విపరీతంగా డిప్రెషన్ కు లోనయినప్పుడు మెదడులోని ఈ రెండు భాగాల మధ్య అనుసంధానం క్షీణించి ఉంటూందని పరిశోధనలవల్ల తెలిసింది.
(మిగతా భాగం తరువాతి టపాలో )