ఆశావాదానికి మూలాలు:
గతంలో కనక మన అనుభవం లోకి వచ్చినట్టయితే, ప్రతికూల పరిస్థితులను పాజిటివ్ గా తీసుకునే గుణం మనలో అలవడుతుంది. ఈ ప్రవ్రుత్తి కార్టెక్స్ మరియూ ఫ్రంటల్ కార్టెక్స్ కు మధ్య నాడీ అనుసంధానం వలన.
ఈ ఉదాహరణ చూడండి: ఒక పరిశీలన లో వాలంటీర్లను కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది.కొన్ని జబ్బులను వారికి చెప్పి ఏ జబ్బు కావాలో ఉహించుకొమ్మని చాయిస్ ఇస్తే వారు విరిగిన కాలును ఉహించుకొన్నారు ఎందుకంటే మిగతా జబ్బులకంటే విరిగిన కాలు అయితే బెడ్ లో పడుకొని టీవీ చూసుకోవచ్చు అని సమాధానం చెప్పారుట. అంటే విరిగిన కాలు బాధాకరమయినప్పటికీ, మిగతా జబ్బులతో పోల్చి చూసుకొని విరిగిన కాలు పరవాలేదనుకున్నారు.మెదడు లో ఈవిధంగా ఉహించుకున్నప్పుడు, ముఖ భాగ సింగు లేట్ కార్టెక్స్ ( rACC ) స్త్రయాటం ( striatum ) కు వచ్చే సిగ్నల్స్ ను నియంత్రించి కేవలం పాజిటివ్ సిగ్నల్స్ ను మాత్రమేక్రియాశీలం చేస్తుంది. మన మెదడు లో ఉండే ఇంకో భాగం జాల కేంద్రకం ( caudate nucleus ) ఈ జాల కేంద్రకం ఒక నాడీ కణాల సముదాయం. మనం ఏవయినా మంచి ఉత్సాహకరమయిన వార్తలు మనం విన్నప్పుడు ఈ జాల కేంద్రకం మెదడు లో మిగతా భాగాలకు ముందుగా ప్రకటిస్తూంది. ఇలా మనం వినబోయే వార్త తటస్తమయిన ( neutral ) వార్త అయినప్పటికీ, మనం ఈ వార్తను పాజిటివ్ గా ఉహించుకొని క్రియాశీలురమవుతాము ఈ జాల కేంద్రకం యొక్క ‘ ప్రకటన’ వల్ల!!. అంటే ఈ జాల కేంద్రకం మనలో సరిగా పని చేయకపోతే నిర్ణయాలు తీసుకోవటంలో మందగించి సందిగ్ధం లో పడుతూ ఉంటాము తరచూ.
అమెరికాలో ఒక సర్వే లో నూటికి పది మంది వంద ఎండ్లకన్నా ఎక్కువ కాలం జీవించ గలమని చెప్పారుట. కానీ నిజానికి వెయ్యి మందిలో ఇద్దరు అమెరికన్లు మాత్రమే వంద ఎండ్లకన్నా ఎక్కువ కాలం జీవిస్తూన్నారు. అలాగే ఇంకో ఉదాహరణ: అమెరికా లో వివాహాన్ని రిజిస్టరు చేసుకునే ఆఫీసు లో వంద కు ఒక్కరు కూడా విడాకులు తీసుకునే ప్రసక్తి లేదు అని సమాధానమిచ్చారుట. కానీ నిజానికి ఒక అంచనా ప్రకారం 2008 లో అమెరికా లో నూటికి నలభయి మంది విడాకులు తీసుకున్నారుట !!!.
మనలో చాలా ఎక్కువమంది ఆశావాద పక్ష పాతం( optimism bias ) తోనే జీవితం గడుపుతాము. కాల క్రమేణా మన జన్యువులలో ( అంటే genes లో ) వచ్చిన మార్పులే దీనికి కారణం. జీవ పరిణామ సిద్ధాంతం కనుక ఈ ఆశావాద పక్ష పాతానికి వర్తింప చేస్తే, ఈ ప్రక్రియ మానవ మనుగడ( survival ) కు ఉపయోగ పడుతూంది. ఆశావాదులు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవిస్తారు.
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూన్న కొద్దీ మన మెదడు లో జరిగే క్లిష్టమయిన ఈ జీవ క్రియలు మనకు స్పష్టం గా తెలుస్తూ ఉన్నాయి. ఈ విజ్ఞానం వల్ల మనం యుక్తా యుక్త విచక్షణను అలవరచుకుని మన జీవితాలలో ఉండే భ్రమలను వాస్తవాలను బేరీజు వేసుకో గలిగి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకో గలుగుతాము !!!.
( ‘ టైం’ సౌజన్యం తో )